వాళ్లిద్దరూ ఆ రెండు జట్లకు వెన్నెముకలాంటి వాళ్లు. ఇద్దరి ఆటశైలి పూర్తిగా భిన్నం. ఒకరు నెమ్మదిగా సాంప్రదాయ తరహాలో తమ ఆటతీరుతో అలరిస్తే... మరొకరు దూకుడుతో చెలరేగిపోతారు. దాదాపుగా ఒకేసారి వన్డే కెరీర్‌ను ప్రారంభించిన ఈ ఇద్దరి కెరీర్ పోటాపోటీగా సాగుతోంది. ఆ ఇద్దరూ ఎవరో కాదు.. ఒకరు దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా అయితే మరొకరు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి. ఒకరి రికార్డును మరొకరు అధిగమిస్తూ పోటీలు పడి పరుగుల వర్షం కురిపిస్తున్నారు. విరాట్ వన్డేల్లో నెలకొల్పిన వేగవంతమైన 23 సెంచరీల రికార్డును సఫారీ ఆటగాడు ఆమ్లా అధిగమించడమే వారి మధ్య పోటీకి అద్దం పడుతోంది.
ముక్కోణపు సిరీస్ లోభాగంగా వెస్టిండీస్‌తో బుధవారం జరిగిన వన్డేలో ఆమ్లా శతకంతో అలరించాడు. దీంతో కోహ్లి 23 వేగవంతమైన సెంచరీల రికార్డు బద్దలైంది. విరాట్ 157 ఇన్నింగ్స్‌లలో 23వ సెంచరీని చేస్తే, ఆమ్లాకు 132వ ఇన్నింగ్స్‌లోనే ఆ మార్కును చేరాడు. సమకాలీన క్రికెట్లో ఈ ఇద్దరు క్రికెటర్లు 2008లోనే అంతర్జాతీయ వన్డే కెరీర్‌ను ఆరంభించడం మరో విశేషం. ఒకవైపు రికార్డులు సృష్టించుకుంటూ విరాట్ ముందుకు సాగుతుంటే, ఆమ్లా వాటిని అధిగమిస్తునే ఉన్నాడు.
గతంలో వేగంగా 20 సెంచరీలు, ఐదు వేల పరుగులులాంటి కోహ్లి సాధించిన ఘనతలను ఆమ్లా బ్రేక్ చేశాడు. మరోవైపు విరాట్ పిన్నవయసులో నమోదు చేసిన 10 సెంచరీల వన్డే రికార్డును దక్షిణాఫ్రికాకే చెందిన డీకాక్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అధిగమించిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ మ్యాచ్ సందర్భంగా డీ కాక్ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. డీకాక్ 23 సంవత్సరాల 54 రోజుల వయసులో 10 సెంచరీలు చేస్తే, అదే విరాట్ 10 సెంచరీలు చేయడానికి 23 సంవత్సరాల 159 రోజులు పట్టింది. ఇదిలా ఉండగా కోహ్లి ఇప్పటివరకూ 171 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 25వ సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.
మరోవైపు ఇవాళ విరాట్ కోహ్లి ఓ ' ఇంటి' వాడయ్యాడు. తాజాగా అత్యంత విలాసవంతమైన ఓ అపార్ట్ మెంట్ ను విరాట్ తాజాగా కొనుగోలు చేసి ఇంటివాడయ్యాడు. ముంబై నగరంలో వార్లీ ప్రాంతంలో ఓంకార్ రియల్టర్స్ అండ్ డెవలపర్స్ సూపర్ లగ్జరీ ప్రాజెక్ట్ టవర్ -సిలో 35వ అంతస్తును విరాట్ కొనుగోలు చేశాడు. సుమారు 7,171 చదరపు అడుగుల వైశాల్యం గల అపార్ట్ మెంట్ విలువ రూ. 34 కోట్లు. గత కొన్ని నెలల నుంచి ఓంకార్ రియల్టర్స్ అండ్ డెవలపర్స్ తో చర్చలు సాగించిన పిదప విరాట్ అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేశాడు.
అయితే విరాట్ ఖరీదు చేసిన ఈ అత్యంత విలాసవంతమైన అపార్ట్ మెంట్ లో ఐదు బెడ్ రూమ్‌లను కల్గి ఉండటమే కాకుండా, నేరుగా సముద్రాన్ని వీక్షించే అవకాశం ఉంది. ఇక్కడ అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేయాలని విరాట్ గతేడాదే ఫిక్సయ్యాడట. దానిలో భాగంగానే 2015లో ఈ సైట్‌ను గర్ల్ ఫ్రండ్ అనుష్క శర్మతో కలిసి విరాట్ వీక్షించాడు. ఇదిలా ఉండగా మరో క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు కూడా గతంలో ఇదే టవర్-సిలో ఓ అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేయడం విశేషం. 2014లో 29వ అంతస్తును యువరాజ్ సింగ్ ఖరీదు చేశాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more