Pakistan opener Sharjeel Khan talks of threats, blackmail

Pakistan batsman sharjeel khan receives threat calls

Pakistan opener batsman, Sharjeel Khan, Twitter, Facebook, phone calls, threat calls, blackmail, fake videos, social media, PCB

Pakistan opener Sharjeel Khan has claimed that he had been receiving calls from unknown persons trying to blackmail him by threatening to post his ‘fake videos’ on social media.

నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు: పాక్ క్రికెటర్

Posted: 05/14/2016 05:52 PM IST
Pakistan batsman sharjeel khan receives threat calls

పాకిస్థాన్ క్రికెటర్ ను టార్గెట్ చేసిన బ్లాక్ మెయిలర్లు తాము అడిగినంత డబ్బు ఇవాలని డిమాండ్ చేయడంతో బిత్తరపోయిన క్రికెటర్ ఏకంగా సామాజిక మాద్యామంలో ఈ విషయాన్ని పేర్కోన్నాడు. డబ్బు కోసం తనను గుర్తు తెలియని వ్యక్తులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ పాకిస్తాన్ క్రికెటర్ షర్జీల్ ఖాన్ చెప్పాడు. తనకు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని, లేకుంటే తన నకిలీ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించినట్టు తెలిపాడు. షర్జీల్ ట్విట్టర్లో ఈ విషయాన్ని వెల్లడించాడు.

'కొందరు గుర్తుతెలియని నెంబర్ల నుంచి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. లేకుంటే నా భవిష్యత్కు భంగం కలిగించేలా వీడియోలను పోస్ట్ చేస్తామని బెదిరించారు. ఎవరైనా అలాంటి వీడియోలను పోస్ట్ చేస్తే దయచేసి నమ్మకండి. అవన్నీ నకిలీ వీడియోలు. కొందరు నా ట్విట్టర్, ఫేస్బుక్ ఎకౌంట్లను కూడా హ్యాక్ చేసేందుకు ప్రయత్నించారు' అని అభిమానులు, స్నేహితులను ఉద్దేశించి షర్జీల్ ట్వీట్ చేశాడు. బెదిరింపుల కేసులో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, పోలీసులు షర్జీల్కు అండగా నిలిచారు. ఆసియా కప్, ప్రపంచ టి-20 కప్లో పాక్కు షర్జీల్ ప్రాతినిధ్యం వహించాడు.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan cricketer  Sharjeel Khan  blackmail  threat calls  PCB  

Other Articles