Furious Preity Zinta publicly abuses KXIP coach Sanjay Bangar

I was not abused by preity zinta says sanjay bangar

sanjay bangar, bangar, preity zinta, preity, zinta, preity zinta kxip, sanjay bangar coach, sanjay bangar kxip ipl, kxip results, kxip schedule, ipl news, ipl

A media report had claimed that Preity Zinta, co-owner of KXIP, hurled expletives at Sanjay Bangar after the narrow loss to RCB.

పంజాబ్ కోచ్ కు జింతాతత..? కాదంటున్న బంగర్

Posted: 05/12/2016 07:54 PM IST
I was not abused by preity zinta says sanjay bangar

సొట్టబుగ్గల సుందరి, బాలీవుడ్ హీరోయిన్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు సహ యజమానిగా వున్న ప్రితీ జింతా తన జట్టు పేలవ ప్రదర్శనపై మండిపడిందట. పంజాబ్‌ జట్టుకు ఈ సీజన్ లోనూ ఐపీఎల్‌ అచ్చిరాలేదు. ఆడిన పది మ్యాచ్‌ల్లో ఏడింటిలో ఓడి.. మూడింటిని మాత్రమే గెలిచింది దీంతో గత ఐపీఎల్‌ మాదిరిగానే పంజాబ్‌ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలుస్తోంది. ఇక, ఫ్లే ఆఫ్‌ ఆ జట్టుకు దాదాపు అవకాశాలు లేనట్టే. దీంతో జట్టు యజమానురాలికి మండిపోయిందట.

ఈ నేపథ్యంలో మొహాలిలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌- పంజాబ్‌ మ్యాచ్ అనంతరం ప్రీతి జింటా జట్టు కోచ్‌ సంజయ్‌ బంగర్‌ పై ఆగ్రహం వ్యక్తం చేసిందట. ఈ మ్యాచ్‌లో అనూహ్యంగా ఒక్క పరుగు తేడాతో పంజాబ్‌ ఓడిపోయిన సంగతి తెలిసిందే.  సంజయ్‌ బంగార్‌ తన ఇష్టానుసారం బ్యాటింగ్ ఆర్డర్‌ మార్చడం.. అక్సర్‌ పటేల్‌ కన్నా ముందే ఫర్మాన్ బెహర్దీన్‌తో పంపించడం ప్రీతికి కోపం తెప్పించిందట. దీంతో జట్టు ఆటగాళ్లు, సహాయ సిబ్బంది ముందే బంగార్‌ను కోపంలో ప్రీతి అనరాని మాటలు అన్నదని, తిట్టిపోసిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్టు మీడియా కథనాలు వచ్చాయి.

అయితే, ఈ కథనాలపై ప్రీతి జింటా వివరణ ఇచ్చింది. ఈ కథనాలు సత్యదూరమని తోసిపుచ్చింది, ఈ కథనాలు రుజువైతే తాను దీనికైనా సిద్ధమేనని, ఒకవేళ రుజువు కాలేదని తేలితే ఈ కథనాలు రాసిన జర్నలిస్టులు ఏం చేస్తారని ఆమె ప్రశ్నించింది. తాను కోచ్‌పై బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వచ్చిన కథనాలను ఆమె ఖండించింది. కాగా జట్టు మెరుగైన ప్రదర్శన కోసం తాము చర్చించుకోవడంలో ఏ మాత్రం తప్పులేదని, అంతమాత్రాన తానేదో కోచ్ ను ఇష్టానుసారం తిట్టేసినట్టు కథనాలను ప్రచురించడం సరికాదని అక్షేపించింది,

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ipl-2016  sanjay bangar  preity zinta  kings eleven punjab  

Other Articles