Waqar Younis caused disharmony in team, insecurity among players says Abdul Razzaq

Razzaq slams waqar for pakistan woe

Abdul Razzaq, Waqar Younis, pakistan, pakistan cricket news, pakistan cricket, pakistan cricket team, waqar younis, abdul razzaq, pakistan cricket board, cricket news, cricket

Abdul Razzaq said that Waqar Younis, instead of blaming others, should realise he himself is responsible for Pakistan team's downfall

ఆటగాళ్ల మధ్య సఖ్యత దెబ్బతీసింది వాకారే..

Posted: 04/24/2016 09:58 AM IST
Razzaq slams waqar for pakistan woe

పాకిస్తాన్ క్రికెట్ కోచ్గా పని చేసి ఇటీవల ఆ పదవి నుంచి వైదొలిగిన వకార్ యూనిస్పై ఆ దేశ క్రికెటర్ అబ్దుల్ రజాక్ మండిపడ్డాడు. వకార్ వల్ల పాకిస్తాన్ క్రికెట్కు తీరని నష్టం జరిగిందంటూ రజాక్ విమర్శించాడు. వకార్ అతని వైఫల్యాన్ని పక్కకు పెట్టి ఇతరుల్ని తప్పుబడుతున్నాడన్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ జరిగిన నష్టానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? అని నిలదీశాడు. పాకిస్తాన్ క్రికెట్లో రహస్యమేమీ లేదు. సీనియర్ ఆటగాళ్లకు వకార్ ఎప్పుడూ గౌరవం ఇవ్వలేదని అన్నాడు. దాంతో పాటు ఆటగాళ్లని కూడా సమాన దృష్టితో కూడా చూసేవాడు కాదని రజాక్ అరోపించాడు.

ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని కల్గించే పని ఎప్పుడూ చేయలేదని వారి మధ్య సఖ్యత దెబ్బతినేలా చేసింది కూడా వాకరేనని విమర్శించాడు. ఇందుకు తానే సాక్ష్యమన్నాడు. దానికి అతనిలో ఉన్న అభద్రతా భావమే ప్రధాన కారణమని చెప్పాడు. పదే పదే తప్పులు చేస్తూ పాకిస్తాన్ క్రికెట్ అట్టడుగు స్థాయికి వెళ్లడానికి వకార్ కారణమమయ్యాడని రజాక్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ క్రికెట్ సలహాదారులుగా యూనస్ ఖాన్, మిస్బాబుల్ హక్లను నియమించడం పట్ల కూడా రజాక్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Abdul Razzaq  Waqar Younis  pakistan  pakistan cricket board  

Other Articles