Dropping Harsha Bhogle from IPL is demeaning an honest, self-made Indian who makes us proud

Harsha bhogle hopes cricketers havent complained against his commentary

BringBackHarsha, Cricket commentary, Harsha Bhogle, Harsha Bhogle Axing, Indian Premier League, IPL 2016, IPL 9, indian commentator, team india cricketers, comenting contract

Had he picked up a tricolor and deliriously run around the stadium chanting "Bharat Mata Ki Jai", it is quite likely that Harsha Bhogle would have been in the IPL commentary box today.

ఇప్పటికీ బిసిసిఐ నిర్ణయంపై హర్ష విస్మయం

Posted: 04/12/2016 06:57 PM IST
Harsha bhogle hopes cricketers havent complained against his commentary

ఐపీఎల్-9వ సీజన్ ఆరంభంలోనే ప్రఖ్యాత కామెంటేటర్ హర్షా భోగ్లేను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఆకస్మికంగా తొలగించడం వెనుక కారణాలేమిటన్నదానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వరల్డ్ టీ 20 అనంతరం భారత క్రికెట్ జట్టులోని కొంతమంది సీనియర్ క్రికెటర్లు బోగ్లేపై ఫిర్యాదు చేయడంతోనే అతన్ని కామెంటేటర్ పదవికి ఉద్వాసన పలికారనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. అయితే ఈ వార్తలను హర్షా బోగ్లే ఖండించాడు. టీమిండియా క్రికెటర్లు తనపై ఫిర్యాదు చేసి తొలగింపుకు కారణమవుతారని అనుకోవడం లేదన్నాడు.

క్రికెట్ కామెంటేటర్ గా ఉన్న తాను ప్రతీ క్రికెటర్ గురించి మాట్లాడుతుంటానన్నారు. వాళ్లు మెరుగైన ప్రదర్శన ఇవ్వాలనేది తన అభిలాష అని తెలిపారు. తన కామెంటరీతో వారు చేసే పరుగుల్ని, వికెట్లను, క్యాచ్లను ఆపలేనని, వాటిని తాను ఎలా బాధ్యుడిని అవుతానని ప్రశ్నించారు. ఒక యూనివర్శిటీ స్థాయి క్రికెటర్ అయినా వారి గురించి చెప్పడమే నా విధి. అటువంటప్పుడు క్రికెటర్లు నా గురించి ఫిర్యాదు చేస్తారని ఎలా అనుకుంటాను. అది క్రికెటర్ల పని కాదనేది నా బలమైన నమ్మకం' అని హర్షాబోగ్లే పేర్కొన్నాడు.

భోగ్లే కాంట్రాక్టును బీసీసీఐ రద్దు చేయడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. కాగా తనను ఎందుకు తొలగించారో కారణం తెలియదని భోగ్లే చెబుతున్నాడు. బీసీసీఐ కూడా కారణం వెల్లడించలేదు. ఐపీఎల్ టోర్నీకి రెండ్రోజుల ముందు వరకు ఆయన కామెంటరీ ప్యానెల్లో ఉన్నాడు. ఫ్లైట్ టికెట్లు కూడా ఒకే అయ్యాయి. ఇంతలోనే తన సేవలు అవసరం లేదని ఈ మెయిల్ పంపినట్టు భోగ్లే వాపోయాడు. ఈ నేపథ్యంలో ఆయన్ను ఎందుకు తొలగించారన్నది చర్చనీయాంశంగా మారింది. ఆయనకు మద్దతుగా సోషల్ మీడియాలో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : team India senior players  Harsha Bhogle  IPL-9  cricket commentator  

Other Articles