Kohli continued to reprise his role as Australia's tormentor-in-chief

Ravichandran ashwin first indian to take 50 t20i wickets

Icc World T20. Ravichandran Ashwin, virat kohli, Australia, Yuvraj Singh, Mahendra Singh Dhoni, Icc world cup T20-2016,indvsaus, india vs australia, ind vs aus, australia vs india, aus vs ind, virat kohli, kohli, sunil gavaskar, gavaskar, india virat kohli, kohli, wt20, icc world t20, cricket

Virat Kohli is in peak form slamming 184 runs so far in this ICC World Twenty20 while Ravichandran Ashwin became the first Indian to pick up 50 T20 international wickets.

50 వికెట్ల క్లబ్ లోకి అశ్విన్, విరాట్ మెరుగుపర్చుకున్నాడు

Posted: 03/29/2016 05:09 PM IST
Ravichandran ashwin first indian to take 50 t20i wickets

భారత స్పిన్నర్ రవిచంద్రన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వరల్డ్ ట్వంటీ 20 లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ వికెట్ తీసిన అశ్విన్ 50 వికెట్ల క్లబ్లో చేరాడు. తద్వారా ట్వంటీ 20ల్లో యాభై వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ గా అశ్విన్ గుర్తింపు సాధించాడు. ఆదివారం జరిగిన కీలక మ్యాచ్ లో వార్నర్ ను బోల్తా కొట్టించి ఆసీస్ జోరుకు అశ్విన్ అడ్డుకట్టవేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు వరల్డ్ ట్వంటీ 20లో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించి ఛేజింగ్ రికార్డును మరింత మెరుగుపరుచుకున్న విరాట్ కోహ్లీ మళ్లీ ఐసీసీ టీ 20 ర్యాకింగ్స్ లో ఎగబాకాడు. తన స్థానాన్ని మెరుగుపర్చుకుని తొలి ర్యాంకుకు మళ్లీ చేరుకున్నాడు. ప్రత్యేకంగా ట్వంటీ 20ల ఛేజింగ్ లో 15 ఇన్నింగ్స్ లు ఆడి 122.83 సగటుతో 737 పరుగులను నమోదు చేశాడు.  ఇందులో ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం.

భారత్ తరపున ఇప్పటివరకూ 42 ట్వంటీ 20లు ఆడిన కోహ్లి 15 హాఫ్ సెంచరీల సాయంతో  1,552 పరుగులు నమోదు చేశాడు. ఇందులో అతని అత్యుత్తమ స్కోరు 90 నాటౌట్. ఈ ఏడాది ఆరంభంలో అడిలైడ్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో అజేయంగా 90 పరుగులు చేసిన కోహ్లి.. మళ్లీ అదే జట్టుపై రెండో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు(82 నాటౌట్)ను సాధించాడు.  ఇది భారత్ లో కోహ్లి ఆడిన ట్వంటీ 20ల్లో అతను నమోదు చేసిన అత్యుత్తమ స్కోరు కావడం మరో విశేషం.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravichandran Ashwin  virat kohli  india  australia  semi finals  cricket  

Other Articles