Former Pakistan cricketer finds India-Bangladesh game suspicious, calls for ICC to investigate

Icc should investigate india bangladesh match says tauseef ahmed

icc world t20, world t20, Tauseef Ahmed, T20 World cup, India vs Bangladesh, ICC anti corruption unit, ICC T20 World Cup, ahmed pakistan, ahmed, icc worldt20, world t20, sports news, sports, cricket

Tauseef Ahmed said he could see no cricketing logic for the way Bangladesh gifted the match to India in the final over.

భారత్-బంగ్లా మ్యాచ్‌పై ఫిక్సింగ్ అరోపణలు

Posted: 03/27/2016 04:01 PM IST
Icc should investigate india bangladesh match says tauseef ahmed

భారత్‌-బంగ్లాదేశ్ టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అనుమానాలు వ్యక్తం చేశారు. భారత్ బంగ్లాదేశ్ మ్యాచ్ లో ఫిక్సింగ్ జరిగిందన్న అనుమానాలను ఆయన వ్యక్తం చేశాడు. మూడు బంతుల్లో రెండు పరుగులు చేసి విజయం సాధించే అవకాశాలు ఉన్న బంగ్లాదేశ్ జట్టు ఓడిపోవడం తనకు అనుమానాలు కలిగిస్తోందనన్నారు. ఈ మ్యాచ్‌పై ఐసీసీ అవినీతి నిరోధక విభాగం, భద్రతా యూనిట్‌ దర్యాప్తు జరపాల్సిన అవసరముందని పేర్కొన్నారు. పాకిస్తాన్ తరఫున 34 టెస్టులు, 70 వన్డేలు ఆడిన స్పిన్నర్ తౌసీఫ్ అహ్మద్ ఈ వ్యాఖ్యలు చేశారు.

'మ్యాచ్‌ ముగిసిన తీరు చూస్తే.. ఏదో జరిగినట్టు నాకు తోస్తుంది. ఐసీసీ అధికారులు దీనిపై విచారణ జరుపాల్సిన అవసరముందని అనిపిస్తోంది' అని ఆయన పేర్కొన్నాడు. మూడు వికెట్లు  చేతిలో ఉండగా మూడు బంతుల్లో రెండు పరుగులు చేయాల్సిన స్థితిలో బంగ్లాదేశ్ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. బంగ్లాదేశ్ ప్రస్తుతం అనుభవరాహిత్యమున్న జట్టు కాదు. క్రీజులో వారికి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. అయినా ముందు ఒక సింగిల్ తీసి మ్యాచ్ టైకి ప్రయత్నించి.. ఆ తర్వాత భారీ షాట్‌ ఆడాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా వారు ఎందుకు భారీ షాట్లకు ప్రయత్నించారో అర్థం కావడం లేదని ఆయన పేర్కొన్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tauseef Ahmed  T20 World cup  India vs Bangladesh  ICC anti corruption unit  

Other Articles