Asia Cup T20: India far better than Pakistan, says Kapil Dev

India better than pakistan in asia cup matches says kapil dev

Asia Cup T20, India, Pakistan, Kapil Dev, dhoni, virat kohli, rohit sharma, shikhar dhawan, ashwin, nehra, Mirpur, dhaka, bangladesh, Sher-e-Bangla Stadium, Cricket News, Sports, Cricket

Former captain Kapil Dev said India have the wherewithal to overcome an inexperienced Pakistan and said the youngsters in the team should be made to relax.

పాకిస్థాన్ కన్నా మనవాళ్లే చాల మెరుగు..

Posted: 02/27/2016 03:56 PM IST
India better than pakistan in asia cup matches says kapil dev

పాకిస్తాన్ క్రికెట్ జట్టుతో పోలిస్తే టీమిండియా అన్ని విధాలా మెరుగ్గా ఉందని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు. అటు బ్యాటింగ్ సహా బౌలింగ్ విభాగంలోనూ ధోని సేన మెరుగ్గా వుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆసియా కప్లో భాగంగా ఇవాళ పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో వికెట్ బౌలింగ్కు అనుకూలిస్తే.. ధోనీసేన 170 పరుగులు చేయాల్సిన అవసరం లేదని 130 చాలని కపిల్ అభిప్రాయపడ్డాడు. పాకిస్థాన్ నిర్ణీత లక్ష్యాన్ని చేరకుండా నిలవరించే శక్తి భారత్ బౌలర్లకు వుందని ఆయన అన్నారు.

అయితే 1980ల్లో పాకిస్తాన్ జట్టు పటిష్టంగా ఉండేదని చెప్పిన ఆయన.. ఆ తర్వాత పరిస్థితి మారుతూ వస్తుందన్నారు. గత 15 ఏళ్లుగా భారత్ అన్ని ఫార్మాట్లలో బలోపేతమైందని ఆయన అన్నారు. పాక్ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉన్నా భారత టి-20 జట్టే మెరుగైనది. ఢాకా మ్యాచ్లో విజయం సాధించడానికి ధోని సేనకు కపిల్ సూచన కూడా ఇచ్చాడు. ఢాకాలో పాకిస్తాన్ పేసర్లకు వికెట్ అనుకూలించి, బౌన్స్ లభిస్తే.. భారత బ్యాట్స్మెన్ జాగ్రత్తగా ఆడాలని కపిల్ దేవ్ సూచించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Asia Cup T20  India  Pakistan  Kapil Dev  

Other Articles