Mitchell McClenaghan suffers facial injuries after being struck by bouncer

Mitchell mcclenaghan suffers facial injuries after being struck by bouncer

Cricket, Mitchell McClenaghan, Newzeland, Newzeland Vs Pakistan

New Zealand tailender Mitchell McClenaghan collapsed on the pitch after a bouncer crashed through his grille during a one-day international against Pakistan. McClenaghan suffered facial injuries after being struck in the face. Facing Pakistani quick Anwar Ali on the penultimate ball of New Zealand's innings, McClenaghan was sent to the turf after missing a hook shot.

క్రికెట్ మైదానంలో కుప్పకూలిన మరో క్రికెటర్

Posted: 01/25/2016 05:59 PM IST
Mitchell mcclenaghan suffers facial injuries after being struck by bouncer

క్రికెట్ లో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అనుకోకుండా ఈ ప్రమాదాల్లో కొంత మంది ఆటగాళ్లు ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. తాజాగా మరో క్రీడాకారుడు గాయాలపాలయ్యాడు. అయితే అదృష్టంకొద్దీ అతడు గాయాలతో బయటపడ్డాడు. న్యూజీలాండ్ క్రికెటర్ మిచేల్‌ మెక్‌క్లాన్‌గన్‌ వెల్లింగ్ టన్ లో జరగుతున్న పాకిస్థాన్ న్యుజిలాండ్ మ్యాచ్ లో ఒక్కసారిగా మైదానంలో కుప్పకూలిపోయాడు. పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ అన్వర్ అలీ వేసిన బౌన్సర్‌ ధాటికి మిచేల్‌ మెక్‌క్లాన్‌గన్‌ కిందిపడిపోయాడు. అలీ మెరుపువేగంతో వేసిన బౌన్సర్‌.. మిచేల్‌ హెల్మెట్‌ను దాటి మరీ అతని ఎడుమ కన్నును బలంగా ఢీకొంది. మిచేల్ కు తీవ్ర రక్తస్రావం కాగా, మైదానంలో కిందపడి విలవిల్లాడాడు. వెంటనే స్పందించిన సిబ్బంది అతడిని ఆస్పత్రికి తరలించారు. మిచేల్ కంటి చుట్టూ ఉన్న ఎముకలు విరిగాయని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం అతని గాయానికి కుట్లు వేసి చికిత్స చేశారు.

అయితే, తాను బాగున్నానని మిచేల్ ఆ తర్వాత ట్విట్టర్‌లో తెలిపాడు. మిచేల్‌కు చిన్నపాటి శస్త్రచికిత్స చేయాల్సిన అవసరముందని వైద్యులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cricket  Mitchell McClenaghan  Newzeland  Newzeland Vs Pakistan  

Other Articles