Martina Hingis joins Sania at top of the chart

Martina hingis joins sania mirza as world no 1

sania mirza, sania mirza india, india sania mirza, martina hingis, WTA rankings, hingis, sania mirza martina hingis, sania hingis, sydney international, sydney tennis, tennis news, tennis

The Sania Mirza and Martina Hingis duo is on a 30-match winning streak that has brought them seven straight titles at the US Open, Guangzhou, Wuhan, Beijing and WTA Finals in 2015, and Brisbane and Sydney this year.

సిడ్నీ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్న సానియా-హింగీస్

Posted: 01/17/2016 01:47 PM IST
Martina hingis joins sania mirza as world no 1

అటు అప్రతిహత విజయాలతో దూసుకెళ్తూ.. ఇటు సరికొత్త రికార్డులను తమ పేరున లిఖించుకుంటూ ముందుకు సాగుతున్న డబుల్స్ నెంబర్ వన్ జోడీ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)ల జోడీ మరో విజయాన్ని తమ ఖాతాలోకి వేసుకుని ప్రపంచ నెంబర్ వన్ గా కొనసాగుతున్నారు. సిడ్నీ ఇంటర్నేషనల్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకుని అత్యధిక మ్యాచ్ లలో వరుస విజయాలను అందుకున్న వారిగా చరిత్ర సృష్టిస్తున్నారు.

సిడ్నీ ఓపెన్ టోర్నమెంట్ ఫైనల్లో కరోలిన్ గార్సియా-క్రిస్టినా మ్లడనోవిక్ జంటపై 1-6, 7-5, 10-5 తేడాతో సానియా, హింగిస్ విజయం సాధించారు. సుమారు గంట 13 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో ప్రత్యర్థి జంటపై గెలిచి వరుసగా 30వ గెలుపును తమ ఖాతాలో వేసుకున్నారు. తొలి సెట్ గార్సియా-క్రిస్టినా ద్వయానికి కోల్పోవడం, రెండో సెట్లో 1-4తేడాతో వెనకుంజలో ఉన్నా టాప్ సీడ్ ఏ దశలోనూ తమ పోరాట పటిమను వీడలేదు.

టై బ్రేకర్లో పాయింట్ సాధించి రెండో సెట్ గెలిచిన సానియా జోడీ మూడో సెట్లోనూ ప్రత్యర్థి జంట నుంచి ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వచ్చింది. మొత్తంగా ఈ జోడికిది 11వ మిక్స్డ్ డబుల్స్ టైటిల్. కాగా, సిడ్నీ ఓపెన్ ఈ ఏడాది వీరికి రెండో టైటిల్. 1990లో జానా నవోత్నా-ఎలీనా సుకోవా నెలకొల్పిన 44 మ్యాచ్‌ల రికార్డును ఛేదించాలంటే సానియా జోడి ఇంకా 15 మ్యాచ్‌లు నెగ్గాల్సి ఉంటుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Martina Hingis  Sani Mirza  WTA rankings  Sydney Open Title  

Other Articles