Cricket legend Ian Chappell calls for worldwide Chris Gayle ban

Cricket legend ian chappell calls for worldwide chris gayle ban

Lan Chappell , Chris Gayle, Chris Gayle ban, worldwide Chris Gayle ban, McLaughlin

Australian cricket great Ian Chappell has called on Cricket Australia to propose a worldwide contracting ban on Chris Gayle following his controversial sideline interview with Network Ten reporter Mel McLaughlin. Gayle was fined $10,000 by his BBL side Melbourne Renegades for his on-air mid-match comments to McLaughlin on Monday night.

క్రిస్ గేల్ అంతర్ద్జాతీయ నిషేదం..?

Posted: 01/08/2016 12:59 PM IST
Cricket legend ian chappell calls for worldwide chris gayle ban

క్రిస్ గేల్ మీద అంతకంతకు విమర్:లు పెరుగుతున్నాయి. వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్ మ్యాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు మీద ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్న ఫ్యాన్స్ కు మరోచేదు వార్త. క్రిస్ గేల్ మీద నిషేదం విధించాలన్న డిమాండ్ అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే ఈ ఇష్యూ మీద ఆయనకు పది వేల ఆస్ట్రేలియన్ డాలర్ల జరిమానా విధించిన ఐసిసి తాజాగా క్రిస్ గేల్ మీద నిషేదం కూడా విధిస్తుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. బిగ్ బాష్ లీగ్ మ్యాచ్ సందర్భంగా టీవీ జర్నలిస్టు మెల్ మెక్ లాలిన్ తో అభ్యంతరకరంగా మాట్లాడటం పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఇయాన్ చాపెల్ స్పందించారు. గేల్ పై ప్రపంచ వ్యాప్తంగా నిషేధం విధించాలని డిమాండ్ చేశాడు. ఈ మేరకు ఒక ప్రతిపాదన చేయాలని క్రికెట్ ఆస్ట్రేలియాను కోరాడు. గేల్ ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని, దానిపై సహనంతో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు.

ఆస్ట్రేలియాలోని ఏ క్లబ్బూ అతనితో ఇక కాంట్రాక్టు కుదుర్చుకోకూడదని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయిస్తే తమకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదన్నాడు. అలాగే ఐసీసీకి ఈ మేరకు లేఖ రాసినా పర్వాలేదని, లేని పక్షంలో విడివిడిగా అన్ని దేశాలకు ఈ విషయం చెప్పాలని చాపెల్ కోరాడు. అంతేగాక గేల్ కు కేవలం రూ.6 లక్షల జరిమానాతో సరిపెడితే సరిపోదంటున్నాడు. తాను ఏ మహిళతో మాట్లాడినా ఒకేలాంటి సమాధానం వచ్చిందని, అందరూ అతనిపై నిషేధం విధించాలనే కోరారని చెప్పుకొచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lan Chappell  Chris Gayle  Chris Gayle ban  worldwide Chris Gayle ban  McLaughlin  

Other Articles