Australia drop Shane Watson for India ODIs

Australia drop shane watson for india odis

Shane Watson, Australia, Cricket, ODI, Onedayinternational, Australian cricket team

Shane Watson’s international future looked bleak on Monday after the all-rounder was left out of Australia’s 13-man squad for this month’s one-day series against India on Monday. The 34-year-old, veteran of 190 ODIs and part of the side that won the World Cup last year, retired from Test cricket last September but had hoped to continue playing for his country in the shorter formats.

షేన్ వాట్సన్ కు షాక్. జట్టులో దక్కని చోటు

Posted: 01/04/2016 05:03 PM IST
Australia drop shane watson for india odis

భారత్‌తో జరగనున్న వన్డే సిరిస్‌కు ఆస్టేలియా జట్టు 13 మందితో కూడిన జట్టుని ప్రకటించింది. జనవరి 12న పెర్త్‌లో జరగనున్న మ్యాచ్‌తో ప్రారంభం కానున్న ఈ సిరిస్‌కు స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా వ్వవహారించనున్నాడు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా మొదటి మూడు వన్డేల్లో ఈ జట్టు తలపడనుంది. ఫాస్ట్ బౌలర్లు జోల్ పారిస్, స్కాట్ బోలాండ్‌లకు జట్టులో చోటు లభించింది. కాగా, ఆస్టేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్‌కు జట్టులో చోటు దక్కక పోవడం విశేషం.

అలాగే గాయం కారణంగా ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ జట్టులో స్థానం కోల్పోయాడు. 26 ఏళ్ల బోలాండ్, 23 ఏళ్ల పారిస్ జాతీయ జట్టులో తొలిసారి చోటు దక్కించుకున్నారు. భారత్, ఆస్టేలియాలు 5 వన్డేలు, 3 ట్వంటీ20లు ఆడతాయి. వరల్డ్ కప్ 2015 సెమీ ఫైనల్ తర్వాత ఇరు జట్లు జనవరి 12న పెర్త్‌లో జరగనున్న వన్డే మ్యాచ్‌తో తలపడనున్నాయి.

ఆసీస్ జట్టు:
స్టీవ్ స్మిత్ (కెప్టెన్),
డేవిడ్ వార్నర్ (వైస్ కెప్టెన్),
జార్జ్ బెయిలీ,
స్కాట్ బోలాండ్,
జోష్ హాజల్‌‌ఉడ్,
జేమ్స్ ఫాల్క్నర్,
ఆరోన్ ఫించ్,
మిచెల్ మార్ష్,
షాన్ మార్ష్,
గ్లెన్ మాక్స్వెల్,
కేన్ రిచర్డ్సన్,
జోయెల్ పారిస్,
మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్).

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shane Watson  Australia  Cricket  ODI  Onedayinternational  Australian cricket team  

Other Articles