టి20 జట్టులో డాషింగ్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్‌ను చేర్చడాన్ని బౌలింగ్ దిగ్గజం కపిల్ దేవ్ స్వాగతించారు. జాన్ మెకన్రో, మారడోనాలాగా యువీకి జనాభిమానం చాలా ఎక్కువని అభివర్ణించారు. ‘యువీ చాలా ఉత్సాహవంతమైన క్రికెటర్. మెకన్రో, మారడోనాలాగే తనకీ అభిమానులు చాలా ఎక్కువ. కేవలం వీళ్ల ఆటను చూడటానికే జనాలు వస్తారు. యువరాజ్ కూడా ఆ కోవలోకే వస్తాడు. తన బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌తో అభిమానులను మైదానానికి రప్పిస్తాడు. అందుకే అతను నిఖార్సైన మ్యాచ్ విన్నర్. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలడు’ అని కపిల్ పేర్కొన్నారు.
ఇక అజింక్య రహానే పూర్తిస్థాయి బ్యాట్స్ మన్ అంటూ కపిల్ దేవ్ సహా దిగ్గజ క్రికెటర్ వివీఎస్ లక్ష్మణ్ కూడా కొనియాడారు. రహానేపై భారత్ బ్యాటింగ్ యూనిట్ అధారపడవచ్చని కూడా వారు ధీమా వ్యక్తం చేశారు. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో దక్షిణాఫ్రికాపై ఒక టెస్టులోని రెండు ఇన్నింగ్స్ లో రహానే సాధించిన రెండు శతకాలు ఆయనలోని ఫోకస్, ఖచ్చితత్వాన్ని వ్యక్తం చేస్తున్నాయని అన్నారు. కపిల్, లక్ష్మణ్ లు టి20 జట్టుకు ధోనిని కెప్టెన్‌గా నియమించడం, పేసర్ల పట్ల విరాట్ దృక్పథాన్ని కూడా ఈ మాజీలు ప్రశంసించారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Mar 18 | సూర్యకుమార్ యాదవ్ కల ఎట్టకేలకు సాకరమైంది. టీమిండియా తరఫున ఆడాలన్న అతడి నిరీక్షణకు తెరపడి, ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టీ20లో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. దీనిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న ఈ... Read more
Feb 27 | దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే, టీ20 సిరీస్ కు భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐదు వన్డేల సిరీస్‌కు కెప్టెన్ మిథాలీ రాజ్, 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని సభ్యుల... Read more
Feb 27 | ఇంగ్లండ్‌తో జరుగనున్న కీలకమైన నాలుగో టెస్టుకు టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈ ఫాస్ట్‌బౌలర్ అహ్మదాబాద్ టెస్టు నుంచి తప్పుకొన్నాడు. తనకు విశ్రాంతి కావాల్సిందిగా బుమ్రా భారత... Read more
Feb 16 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేయగా, అందులో ఇంగ్లండ్ అగ్రస్థానంలో నిలిచింది. ఏకంగా 25 మ్యాచులు అడిన ఇంగ్లాండ్ 6877 పాయింట్లతో 275 రేటింగ్ తో అగ్రస్థానంలో కోనసాగుతోంది. కాగా... Read more
Feb 16 | పర్యాటక జట్టు ఇంగ్లండ్ తో చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. పర్యాటక జట్టుపై ఏకంగా 317 పరుగుల భారీ తేడాతో నెగ్గిన టీమిండియా ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్... Read more