Sharjah to Greater Noida: Afghanistan cricket team relocates to new ‘home’

Afghanistan get home ground in india

afghanistan, afghanistan cricket, afghanistan cricket team, afghanistan greater noida, greater noida cricket stadium, cricket news, cricket

Afghanistan signed an MOU with BCCI and Greater Noida Development Authority on Thursday.

అఫ్ఠనిస్థాన్ క్రికెట్ జట్టుకు ఇండియాలో హోంగ్రౌండ్

Posted: 12/10/2015 07:12 PM IST
Afghanistan get home ground in india

ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డుకు భారత్ లో హోం గ్రౌండ్ ను కల్పించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. భారత్ లో క్రీడా మైదానం కేటాయించాలన్న అఫ్ఘనిస్తాన్ వినతి మేరకు బిసిసిఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు. ఆఫ్ఘనిస్థాన్ లో క్రికెట్ అభివృద్ధి నిమిత్తం ఆ దేశ క్రికెట్ బోర్డుతో బీసీసీఐ ఎంవోయూ కుదుర్చుకుంది. ఢిల్లీలో జరిగిన ఈ ఒప్పందంపై బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్, ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లాతో పాటు ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారులు సంతకాలు చేశారు.

ఈ ఒప్పందంలో భాగంగా ఉత్తర్ ప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడా క్రికెట్ స్టేడియాన్ని ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ అప్పగించింది. ఈ స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన ఆటగాళ్లు శిక్షణ పొందడంతో పాటు మ్యాచ్ ఆడే వెసులుబాటు కల్పించారు. ఆఫ్ఘనిస్థాన్ లో క్రికెట్ అభివృద్ధికి సహాయం చేయాలని ఆ దేశం గతంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డును కోరడంతో.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్న బిసిసిఐ నోయిడా మైదానాన్ని వారికి అప్పగిస్తూ ఒప్పందం కుదుర్చుకుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Afghanistan  home ground  India  greater noida  

Other Articles