India vs South Africa Virat Kohli and Co Aim to Spoil Proteas Aw

Team india eyes test series against south africa

virat kohli, india vs south africa, india vs sa, ind vs sa, india cricket team, india cricket, cricket india, virat kohli, kohli, r ashwin, ashwin, cricket news, cricket

India lead the four-match series against South Africa 1-0 going into the third Test in Nagpur. The visitors have not lost a Test series away from home since their 0-2 loss to Sri Lanka in 2006.

సిరీస్ పై టీమిండియా గురి.. సజీవ చాన్సు కోసం సఫారీలు..

Posted: 11/24/2015 06:53 PM IST
Team india eyes test series against south africa

నాగ్ పూర్ టెస్టును కైవసం చేసుకుని సఫారీలపై పైచేయి సాధించాలని టీమిండియా ఉత్సహంతో ఉరకలు వేస్తుండగా, ఆశలు సజీవంగా వుంచుకుని చివరి టెస్టును కూడా గెలిచి వన్డే , ట్వంటీ 20 సిరీస్ తరహాలోనే టెస్టు సిరీస్ ను గెలుచుకుని వెళ్లాలని సఫారీలు యోచిస్తున్నారు. అయితే నాగ్ పూర్ వేదికగా జరగనున్న మూడో టెస్టులో గెలిచి.. సొంతగడ్డపై తొలి టెస్టు సిరీస్ ను కైవసం చేసుకున్న రికార్డు కోసం కోహ్లీ నాయకత్వం ఆత్రుతగా ఎదురుచూస్తుంది. తనపై నమ్మకంతో కెప్టెన్సీ బాద్యతలు అప్పగించిన బిసిసిఐకి సిరీస్ ను బహుమతిగా ఇవ్వాలని యోచిస్తుంది కోహ్లీ సేన.

వన్డే, ట్వంటీ 20 సిరీస్ లను కోల్పోయిన టీమిండియా.. టెస్టులో మాత్రం అంచనాలకు మించి ప్రత్యర్థులను చిత్తు చేస్తూ రాణిస్తుంది. మొహాలీలో జరిగిన తొలి టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా.. బెంగళూరులో జరిగిన రెండో టెస్టులో కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావించింది. కాగా, వర్షం కారణంగా నాలుగు రోజుల ఆట జరగకపోవడంతో ఆ టెస్టు రద్దయింది. అయితే నాగ్ పూర్ లో బుధవారం ఆరంభమయ్యే మూడో టెస్టులో సఫారీలకు మరోషాక్ ఇవ్వాలని విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా భావిస్తోంది. దీనిలో భాగంగానే మరోసారి స్పిన్ పిచ్ ను రూపొందించారు. ఇప్పటికే ఈ విషయాన్ని పిచ్ క్యురేటర్ ధృవీకరించాడు. గత టెస్టుల్లో స్పిన్ తో దక్షిణాఫ్రికాను కట్టడి చేసిన టీమిండియా అదే దిశగా ముందుగు సాగుతోంది.

మరోపక్క దక్షిణాఫ్రికా మూడో టెస్టును గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన దక్షిణాఫ్రికా నాలుగు టెస్టుల సిరీస్ లో తొలి విజయాన్ని నమోదు చేసుకోవాలనే పట్టుదలగా ఉంది. హషీమ్ ఆమ్లా సారథ్యంలోని సఫారీలు టీమిండియాను కట్టడి చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ప్రధానంగా టీమిండియా స్పిన్ మంత్రాన్నిసమర్ధవంతంగా ఎదుర్కొనడంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య రేపు ఉదయం గం.9.30ని.లకు ప్రారంభమయ్యే మూడో టెస్టు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  india  south africa  test series  

Other Articles