Michael Clarke slams Matthew Hayden, Andrew Symonds, John Buchanan for 'low act' pot shots

Michael clarke slams teammates john buchanan in new book

michael clarke, michael clarke australia, australia michael clarke, michael clarke australia captain, michael clarke runs, Matthew Hayden, Andrew Symonds, John Buchanan, 'low act' pot shots, cricket news, cricket

Former Australia captain Michael Clarke has used his "Ashes Diary 2015" to hit back on his ex-colleagues who publicly questioned him.

తన సహచరులపై ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డ మైకిల్ క్లార్క్

Posted: 11/19/2015 06:52 PM IST
Michael clarke slams teammates john buchanan in new book

తన సహచర ఆటగాళ్లపై  ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డాడు.  యాషెస్ సిరీస్ ను ఆసీస్ కోల్పోయిన అనంతరం మాజీ ఆటగాళ్లు ఆండ్రూ సైమండ్స్, మ్యాథ్యూ హేడెన్ లు క్లార్క్ శైలిని తప్పుబట్టారు. ఆ ఓటమికి  క్లార్క్ ఆట తీరే ప్రధాన కారణం అంటూ చేసిన విమర్శలపై క్లార్క్.. తాజాగా యాషెస్ 2015 పేరిట రాసిన డైరీలో మండిపడ్డాడు. అసలు సైమండ్స్ కు తన నాయకత్వంపై మాట్లాడే హోదానే లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓ టీవీ షో ముందు కూర్చొని మిగతా వారి నాయకత్వాని ప్రశ్నించే అర్హత సైమండ్ కు ఎక్కడిదని ప్రశ్నించాడు.  తనపై విమర్శలు చేసే ముందు అతని వ్యక్తిత్వాన్ని ముందుగా తెలుసుకుంటే మంచిదని సూచించాడు.
 
సైమండ్స్ ఆడేటప్పుడు తాగి వచ్చేవాడని  క్లార్క్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.  ఆసీస్ జట్టు 2009లో ఇంగ్లండ్ లో  పర్యటించినప్పుడు ఆల్కహాల్ ను తీసుకోవద్దంటూ ఆటగాళ్లకు క్రికెట్ ఆస్ట్రేలియా('సీఏ) మార్గదర్శకాలు జారీ చేసిన దాన్ని సైమండ్స్ అతిక్రమించి తన కాంట్రాక్టును కోల్పోయిన విషయాన్ని గుర్తు చేశాడు.  దీంతో పాటు మాథ్యూ హెడెన్ వ్యవహార శైలిపై కూడా క్లార్క్ విరుచుకుపడ్డాడు. కెరీర్ ఆరంభంలో ప్యాడ్ లను కట్టుకుని ఫీల్డ్ లోకి ఆడటానికి వెళ్లమంటే తిరస్కరించే వాడంటూ విమర్శలు గుప్పించాడు.  ఎంతో ఒత్తిడి తెస్తేగానీ ఫీల్డ్ లోకి వెళ్లేవాడు కాదన్నాడు.
 
వీరిద్దరితో పాటు ఆస్ట్రేలియి కోచ్ గా పనిచేసిన జాన్ బుచానన్ పై క్లార్క్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.  ఎప్పుడూ జాతీయ జట్టుకు ఆడని బూచనన్ ఏమి సాధించడంటూ క్లార్క్ నిలదీశాడు. చివరకు తన ఇంట్లో పెంచుకున్న కుక్క జెర్రీ కూడా  కొన్ని విజయాలను సొంతం చేసుకుంటే .. బుచానన్ వెనుక ఎటువంటి సక్సెస్ లేదంటూ క్లార్క్ ఎద్దేవా చేశాడు.   తాను సాధించింది ఏమైనా ఉంటే అది రికార్డులను చూస్తే అర్ధమవుతుందని వారికి క్లార్క్ హితోపదేశం చేశాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Michael Clarke  teammates  John Buchanan  new book  

Other Articles