Sundar Raman resigns as IPL COO, BCCI accepts resignation

Ipl coo sundar raman quits

Cricket IPL Chief Operating Officer Sundar Raman Resigns, IPL COO, Sudar Raman, BCCI, Resignation, sports business man, N Srinivasan, Gurunath Meiyappan, Rajasthan Royals, Raj Kundra, chennai super kings, 2013 spot fixing scandal, latest Cricket new

Sundar Raman faced a lot of flak following the outbreak of 2013 IPL spot-fixing scandal involving former Board President N Srinivasan's son-in-law Gurunath Meiyappan and Rajasthan Royals' then co-owner Raj Kundra.

సుందరరామన్ రాజీనామాను అమోదించిన బిసిసిఐ

Posted: 11/03/2015 02:51 PM IST
Ipl coo sundar raman quits

కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ అరోపణలు ఇంకా ప్రకంపనలు సృష్టిస్తునే వున్నాయి. పలువురు క్రీడాకారులతో పాటు ఐపీఎల్ కు చెందిన రెండు ప్రాంఛైసీలపై కూడా వేటు పడి.. రెండేళ్ల నిషేదం కోనసాగుతన్న తరుణంలో.. తాజాగా బెట్టింగ్, ఫిక్సింగ్ లకు సూత్రధారిగా అభియోగాలను ఎదుర్కోంటున్న ఐపీఎల్ సీవోవో సుందర్ రామన్ తన పదవిని వదులుకున్నారు. ఆయన రాజీనామాను బీసీసీఐ ఆమోదించింది. బోర్డుతో ఆయన అనుబంధం ఈనెల 5తో ముగియనుంది.

నాగపూర్ లో బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ను కలిసి రామన్ తన రాజీనామా సమర్పించారు. 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. రామన్ రాజీనామా చేయాలని అంతకుముందు బిసిసిఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ కోరారు. ఐపీఎల్ పై ప్రజలకు విశ్వాసం పెరగాలంటే ముగ్ధల్ కమిటీ దోషులుగా తేల్చినవారందరూ తక్షణమే బోర్డు పదవులకు రాజీనామా చేయాలని జూలైలో మనోహర్ అన్నారు. పారదర్శతకే పెద్దపీట వేస్తానని ఆయన స్పష్టం చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL COO  Sudar Raman  BCCI  Resignation  

Other Articles