ICC Test Rankings: Root back as No. 1 batsman, no Indian in top-10

Joe root back as no 1 ranked test batsman

England,s,Joe,Root,moves,ahead,Steve,Smith,ICC,Test,batting,rankings, South Africa, Australia, England, Pakistan, India, New Zealand, Sri Lanka, West Indies, Bangladesh, Zimbabwe, ICC Test batsman rankings, Joe Root, Steven Smith, AB de Villiers, Hashim Amla, Younus Khan, Angelo Mathews, Kane Williamson, Alastair Cook, David Warner, Chris Rogers ICC Test bowler rankings, Dale Steyn, Yasir Shah, James Anderson, Stuart Broad, Trent Boult, Mitchell Johnson, Vernon Philander, Ravichandran Ashwin, Rangana Herath, Tim Southee

England’s batsman Joe Root has regained the number-one batting ranking, while Pakistan’s wrist spinner Yasir Shah has become the second highest-ranked bowler in the world in the latest ICC Test Player Rankings

ఐసిసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో మళ్లీ రూట్ టాప్

Posted: 10/27/2015 07:15 PM IST
Joe root back as no 1 ranked test batsman

అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ మరోమారు అగ్రస్థానాన్ని సాధించాడు. ఈ ఏడాది ఆగస్టులో ఆస్ట్రేలియాతో ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన టెస్టు మ్యాచ్ అనంతరం నంబర్ వన ర్యాంకును కోల్పోయిన రూట్.. రెండు నెలల్లోనే ఆ ర్యాంకును చేజిక్కించుకున్నాడు. జో రూట్ 913 పాయింట్లతో అగ్ర స్థానానికి ఎగబాకగా, ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ 910 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఏబి డివిలియర్స్, హషీం ఆమ్లాలు 3,4వ స్థానాల్లో నిలిచారు. ఐదో స్థానంలో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ యూనిస్ ఖాన్ ఉన్నాడు. ఇదిలా ఉండగా, ఏ ఒక్క భారత బ్యాట్స్‌మెన్ టాప్-10లో స్థానం దక్కించుకోలేకపోయారు. విరాట్ కోహ్లీ 11వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.

టెస్టు బౌలింగ్ విభాగంలో దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ 905 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్ స్పిన్నర్ యాసిర్ షా 827 పాయింట్లతో తొలిసారి రెండో స్థానాన్ని సాధించాడు. భారత టెస్టు క్రికెట్ విషయానికొస్తే స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ ఒక్కడే టాప్ 10లో నిలిచాడు. అశ్విన్ 760 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. అలాగే ఆల్ రౌండర్ విభాగంలో అశ్విన్ రెండో స్థానంలో నిలిచాడు. కాగా, టెస్టు జట్లలో దక్షిణాఫ్రికా 125 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా (106 పాయింట్లు) రెండో స్థానంలో, ఇంగ్లాండ్( 102 పాయింట్లు)మూడో స్థానంలో, 101 పాయింట్లతో పాకిస్థాన్ నాల్గో స్థానంలో నిలిచాయి. పాకిస్థాన్ కంటే ఒక పాయింట్ తక్కువగా ఉన్న టీమిండియా(100 పాయింట్లు) ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.

* ఐసిసి టెస్ట్ జట్టు ర్యాంకింగ్స్: *

1. దక్షిణ ఆఫ్రికా 125 పాయింట్లు

2. ఆస్ట్రేలియా 106

3. ఇంగ్లాండ్ 102

4. పాకిస్తాన్ 101

5. భారతదేశం 100

6. న్యూ జేఅలాండ్ 99

7. శ్రీలంక 93

8. వెస్ట్ ఇండీస్ 76

9. బంగ్లాదేశ్ 47

10. జింబాబ్వే 5


* ఐసిసి టెస్ట్ బ్యాట్స్మన్ ర్యాంకింగ్స్ *

1. జో రూట్ (ఇంగ్లాండ్) 913 పాయింట్లు

2. స్టీవెన్ స్మిత్ (ఆస్ట్రేలియా) 910

3. డివిలియర్స్ (దక్షిణ ఆఫ్రికా) 890

4. హషీమ్ ఆమ్లా (దక్షిణ ఆఫ్రికా) 881

5. యూనిస్ ఖాన్ (పాక్) 854

6. ఏంజెలో మాథ్యూస్ (శ్రీలంక) 851

7. కేన్ విలియమ్సన్ (న్యూజీలాండ్) 813

8. అలస్టేయిర్ కుక్ (ఇంగ్లాండ్) 783

9. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) 775

10. క్రిస్ రోజర్స్ (ఆస్ట్రేలియా) 761


* ఐసిసి టెస్ట్ బౌలర్ ర్యాంకింగ్స్ *

1. డేల్ స్టెయిన్ (దక్షిణ ఆఫ్రికా) 905 పాయింట్లు

2. యాసిర్ షాహ్ (పాక్) 827

3. జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లాండ్) 824

4. స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్) 817

5. ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్) 814

6. మిచెల్ జాన్సన్ (ఆస్ట్రేలియా) 773

7. వెర్నాన్ అక్రమసంబంధం (దక్షిణ ఆఫ్రికా) 770

8. రవిచంద్రన్ అశ్విన్ (భారత్) 760

9. రంగన్ హెరాత్ (శ్రీలంక) 751

10. టిమ్ సౌథీ (న్యూజీలాండ్) 713


జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Test batsman rankings  Joe Root  ICC Test bowler rankings  

Other Articles