CSK, RR would return to IPL in 2018 after serving two year suspension

No termination for csk rr 2 new teams in ipl 9

Anurag Thakur, BCCI, Betting Scandal, Chennai Super Kings, Cricket, CSK, Governing Council, IPL, IPL 9, Mumbai, N Srinivasan, President, Rajasthan Royals, RR, SGM, Shashank Manohar, Sports, BCCI Working Committee

BCCI decided against terminating the suspended IPL franchises of CSK and RR, ensuring their comeback in the cash-rich league in 2018.

చెన్నై, రాజస్థాన్ లపై రెండేళ్ల పాటు సస్పెన్షన్

Posted: 10/18/2015 09:09 PM IST
No termination for csk rr 2 new teams in ipl 9

జస్టిస్ లోధా కమిటీ ఇచ్చిన తీర్పుపై బిసిసిఐ కొన్ని సవరణలను చేస్తూ నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ ఆరోఫణలతో నిమగ్నమై చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్ పై నిషేధాన్ని ఎత్తివేసి కేవలం రెండేళ్ల పాటు సస్పెన్షన్ ను విధించింది. వచ్చే ఏడాది 2016లో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 9వ ఎడిషన్‌లో 8 జట్లు బరిలోకి దిగనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. స్ఫాట్ ఫిక్సింగ్ ఆరోపణలను ఎదుర్కొన్న చెన్నైసూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లను టోర్నమెంట్ నుంచి రెండేళ్ల పాటు స్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

2016లో జరిగే ఐపీఎల్‌కు మరో జట్లను జత చేస్తూ టెండర్లను పిలవాలని ఇవాళ ముంబైలో జరిగిన బోర్డు వర్కింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్, అవకతవకలకు పాల్పడినందుకు గాను చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్ ఆర్ఎమ్ లోథా కమిటీ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో రెండేళ్ల నిషేధం తర్వాత తిరిగి 2018లో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్ధాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఆడే విధంగా నిర్ణయం తీసుకున్నారు. దీని అర్ధం 2018 నుంచి ఐపీఎల్‌లో 10 జట్లు ఉండబోతున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  ipl  chennai super kings  rajasthan royals  bcci  

Other Articles