Bangladesh Cricketer Shahadat Hossain Surrender Himself In Dhaka Court In Girl Harassment Case | Harassment Cases

Shahadat hossain surrender in dhaka court in girl harassment case

Shahadat Hossain case, Shahadat Hossain dhaka court, Shahadat Hossain harassment case, Shahadat Hossain photos, Shahadat Hossain wife arrest, girl harassment case

Shahadat Hossain Surrender In Dhaka Court In Girl Harassment Case : Bangladesh Cricketer Shahadat Hossain Surrender Himself In Dhaka Court In Girl Harassment Case.

బాలికను కొట్టిన కేసులో జైలుపాలైన క్రికెటర్

Posted: 10/05/2015 03:23 PM IST
Shahadat hossain surrender in dhaka court in girl harassment case

క్రికెట్ రంగంలో అతనొక అద్భుత ఆటగాడు.. తన బౌలింగ్ ప్రతిభతో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను ముచ్చెమటలు పట్టించే సూపర్ పేసర్.. అంతర్జాతీయ స్థాయిలో జట్టు తరఫున తనకంటూ ప్రత్యేక గుర్తింపు గడించాడు.. కానీ మానవత్వం లేని కర్కశుడు. ప్రపంచానికి మంచి క్రికెటర్ గా తనని తాను పరిచయం చేసుకున్న ఆ క్రికెటర్ లో ఓ రాక్షసుడు కూడా దాగివున్నాడని ఆలస్యంగా తెలిసింది. తన ఇంట్లో పనిచేస్తున్న ఓ బాలికను నిత్యం వేధించి, తీవ్రంగా కొట్టేవాడు. ఇతనితోబాటు భార్య కూడా ఆ అమ్మాయిని తరచూ వేధింపులకు గురిచేసేది. అయితే.. వారి హింసను భరించలేకపోయిన సదరు బాలిక పోలీసులను ఆశ్రయించడం వారి బండారం బయటపడింది. దాంతో వెంటనే క్రికెటర్ సస్పెండ్ కావడంతోపాటు చివరికి జైలుపాలయ్యాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఆటగాడు షహదత్ ఓ అద్భుత పేసర్. ఇతగాడు తమ ఇంట్లో పనిచేస్తున్న బాలికను వేధించి, తీవ్రంగా కొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. క్రీడారంగంలోనే సంచలనం సృష్టించిన ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి షహదత్ చాలా ప్రయత్నాలు చేశాడు కానీ ఏవీ ఫలించలేదు. దీంతో ఇతగాడు కోర్టులో లొంగిపోయాడు. ఢాకా కోర్టులో హాజరైన ఇతగాడు.. న్యాయస్థానం ఆదేశాల మేరకు అతన్ని జైలుకు తరలించారు. ఇదే కేసులో షహదత్ భార్య న్రిట్టో హుస్సేన్ ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. షహదాత్ భార్య పుట్టింట్లో పోలీసులు సోదాలు చేపట్టి అరెస్ట్ చేశారు. ఈ కేసులో షహదత్ దంపతులు కొంతకాలంగా తప్పించుకుని తిరిగారు. భార్య అరెస్ట్ అయిన మరుసటి రోజే షహదత్ కోర్టులో లొంగిపోయాడు. బంగ్లా తరఫున షహదత్ 38 టెస్టులు, 51 వన్డేలు ఆడాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shahadat Hossain  Girl Harassment Case  

Other Articles