India vs South Africa: Team India can’t leave it for late any longer

Team india south africa twenty 20 series starts tomorrow

india vs south africa, ind vs sa, sa vs ind, ind vs sa 2015, india vs south africa 2015, india vs south africa tickets, ms dhoni, virat kohli, dhoni, kohli, du plessis, imran tahir, cricket news, cricket

With skipper MS Dhoni no longer the finisher he once was, India will have to change the pace of run-scoring against South Africa.

ట్వంటీ-20 పోరుకు సిద్దమైన భారత్ సపారీలు.. పైచేయి కోసం ఇరుజట్ల ప్రణాళికలు

Posted: 10/01/2015 06:16 PM IST
Team india south africa twenty 20 series starts tomorrow

సమరం ఆరంభానికి మరి కోన్ని గంటలే మిగిలివుంది. రెండు సమాన స్థాయి జట్లు టీమిండియా-దక్షిణాఫ్రికాల నువ్వా నేనా అంటూ తెల్చుకునేందుకు రంగం సిద్దమైంది. తొలుత పొట్టి ఫ్మారెట్ టీ-20 సిరీస్ శుక్రవారం సాయంత్రం ప్రారంభం కానుంది. మూడు ట్వంటీ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా రేపు ఇరు జట్ల మధ్య ధర్మశాలలో తొలి డే అండ్ నైట్ ట్వంటీ మ్యాచ్ జరుగనుంది. దీంతో ఇరు జట్లు తమ తమ వ్యూహ-ప్రతివ్యూహాల్లో సిద్ధం చేసుకుంటూ..  ట్వంటీ 20 సిరీస్ ను ఘనంగా ఆరంభించాలని భావిస్తున్నాయి. దక్షిణాఫ్రికా సుదీర్ఘ సిరీస్ దృష్ట్యా మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని టీమిండియా బూట్ క్యాంప్(కఠోర సాధన) కు కూడా హాజరైంది. దీంతో పాటుగా గత కొంతకాలంగా టీమిండియా యువ క్రికెటర్లు  విశేషంగా రాణిస్తూ జట్టుకు అండగా నిలుస్తున్నారు.

టీమిండియా  బ్యాటింగ్ విభాగంలో ధోని, విరాట్ కోహ్లి, శిఖర్ ధవన్, రోహిత్ శర్మ, సురేష్ రైనా, అజింక్యా రహానేలు కీలకమైన ఆటగాళ్లు. టాపార్డల్లో ఓపెనర్లు రాణించి మిడిల్ ఆర్డర్ లో భారం పడకుండా చూసే అవసరం ఎంతైనా ఉంది. బౌలింగ్ విషయానికొస్తే భువనేశ్వర్ కుమార్, మోహిత్ శర్మ,  అశ్విన్ లను ప్రధానంగా చెప్పుకోవచ్చు.  ట్వంటీ 20 సిరీస్ కు హర్భజన్ సింగ్, అమిత్ మిశ్రాలు  ఎంపికైనా తుది జట్టులో ఎవరు ఉంటారనేది కాస్త ఆసక్తికరమే. నాలుగో బౌలర్ స్థానంలో ఒక స్పెషలిస్ట్ కావాల్సిస్తే వస్తే హర్భజన్ కు స్థానం కల్పించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.

ఇదిలా ఉండగా ఇటీవల బంగ్లా 'ఎ'తో జరిగిన మూడు రోజుల మ్యాచ్ లో టీమిండియా ప్రధాన ఆటగాడు, ఓపెనర్ ధవన్ ఫామ్ లోకి రావడంతో పాటు ఫిట్ నెస్ ను కూడా నిరూపించుకోవడం కూడా జట్టుకు శుభపరిణామం. కాగా, డు ప్లెసిస్ నేతృత్వంలోని దక్షిణాఫ్రికా ట్వంటీ 20 జట్టు కూడా పటిష్టంగా ఉంది. డు ప్లెసిస్ తో పాటు హషీమ్ ఆమ్లా, డీ కాక్, ఏబీ డివిలియర్స్ లు సఫారీ జట్టులో ప్రధాన ఆటగాళ్లు. పించ్ హిట్టర్ పాత్ర పోషించేందుకు డేవిడ్ మిల్లర్ సిద్ధంగా ఉన్నాడు.  బౌలింగ్ విషయానికొస్తే  అల్బీ మోర్కెల్, కేల్ అబాట్, బెహ్రడైన్, ఇమ్రాన్ తాహీర్ లు కీలకం. దీంతో ఇరు జట్ల మధ్య జరిగి ట్వంటీ 20 సిరీస్ మంచి రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Team indai  south africa  T-20 series  ms dhoni  shikar dhawan  kohli  

Other Articles