After Chris Gayle, Kevin Pietersen also joins Pakistan Super League

Kevin pietersen set to feature in pakistan super league

younis khan, pcb, pakistan super league, psl, chris gayle, kevin pietersen, pakistan cricket board, lahore, england, batsman, kevin pietersen, inaugural, pakistan super league, psl, held, february, united, arab, emirates, pietersen, player, hand, english, batsmen

Former England batsman Kevin Pietersen puts his name up for the inaugural Pakistan Super League (PSL) Twenty20 to be held February next year in the United Arab Emirates.

పాక్ సూపర్ లీగ్ లోకి ఇంగ్లాండ్ పీటర్ సన్

Posted: 09/22/2015 06:54 PM IST
Kevin pietersen set to feature in pakistan super league

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) మంచి సక్సెస్ సాధించి.. త్వరలో పదో సిరీస్ తెరలేపనున్న తరుణంలో.. మనల్ని కాఫీ కోట్టి అదే తరహాలో సూపర్ లీగ్ ను ప్రారంభించాలని ఉవ్విళ్లూరుతున్న పాకిస్థాన్.. రమారమి అన్ని ఏర్పట్లును సిద్దం చేసుకుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్‌) లోగోను ఆదివారం ఆవిష్కరించారు. వచ్చే ఫిబ్రవరి 4 నుంచి 24 వరకు యూఏఈ వేదికగా తొలి సీజన్‌ జరగనుంది. తొలిసారిగా ప్రారంభంకానున్న ఈ సూపర్ లీగ్‌లో ఐదు జట్లు తలపడతాయి.

కాగా ఐపీఎల్ లో స్థానం రాణించిన పలువరు బ్యాట్స్ మెన్లు కూడా సూపర్ సిరీస్ లో ఆడేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ లీగ్‌లో క్రిస్‌ గేల్‌, పొలార్డ్‌, డారెన్ బ్రావో, కెవిన్ పీటర్సన్‌, లసిత్ మలింగ, మాథ్యూస్‌, షకిబ్‌ లాంటి విదేశీ స్టార్లు లీగ్‌లో ఆడతారని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.  ఫిబ్రవరిలో యూఏఈ వేదికగా జరగనున్న ట్వంటీ 20 క్రికెట్‌కు తాను అందుబాటులో ఉండనున్నట్లు కెవిన్ పీటర్సన్ చెప్పాడని తెలుస్తోంది. లాహోర్‌లో పిఎస్ఎల్ లోగో ఆవిష్కరణ సందర్భంగా పీటర్సన్ వీడియో సందేశం పంపించాడు. పాకిస్తాన్ ఈవెంటులో పాల్గొంటున్నానని, రానున్న ఫిబ్రవరిలో ఈ లీగ్ జరగనుందని, ఈ సిరీస్ ప్రారంభం అయ్యే వరకు తాను వేచి చూడలేకపోతున్నానని కెవిన్ పీటర్సన్ తన సందేశంలో పేర్కొన్నాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : younis khan  pcb  pakistan super league  psl  chris gayle  kevin pietersen  

Other Articles