Ishant Sharma and Sri Lankan players Prasad, Chandimal and Lahiru Thirimanne charged by the ICC | SSC Test

Icc charged ishant sharma chandimal prasad thirimanne angry exchanges

ishant sharma, dhammika prasad, dinesh chandimal, lahiru thirimanne, icc, international cricket council, cricket ssc test, india vs sri lanka, sri lanka cricket team, india cricket team, india sri lanka test series

ICC Charged Ishant Sharma Chandimal Prasad Thirimanne Angry Exchanges : India fast bowler Ishant Sharma and Sri Lankan players Dhammika Prasad, Dinesh Chandimal and Lahiru Thirimanne have been charged by the ICC for their roles in several angry exchanges during the fourth day of the SSC Test.

ఇషాంత్ తోపాటు ఆ ముగ్గురిపై ఐసీసీ ఆగ్రహం

Posted: 09/01/2015 02:55 PM IST
Icc charged ishant sharma chandimal prasad thirimanne angry exchanges

టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న కీలక మూడో టెస్టు మ్యాచులో ఇరువర్గాల ఆటగాళ్ల మధ్య అరుదైన ఘట్టాలు చోటు చేసుకున్నాయి. నాలుగో రోజు ఆటలో భాగంగా కొందరు ఆటగాళ్లు నియమాలను అతిక్రమించి వాగ్వాదానికి దిగారు. ఒకరిపైమరొకరు తిట్లు సంధించుకున్నారు. ఆటగాళ్లతోపాటు అందరికీ ఆందోళనకు గురిచేసిన ఈ ఉదంతాన్ని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చాలా సీరియస్ గా తీసుకుంది. ఇందుకు కారకులైన ఆ ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మూడో టెస్టులో భారత పేసర్ ఇషాంత్ శర్మ తన ప్రతిభతో లంక ఆటగాళ్లను చమటలు పట్టించాడు. తొలి ఇన్నింగ్స్ లో వరుసగా వికెట్లు తీసిన ఇతగాడు.. ఈ సందర్భంగానే ఓ లంక క్రికెటర్ తో వాగ్వాదానికి దిగాడు. తాను బౌలింగ్ వేసేంతవరకు అలాగే ప్రవర్తించాడు కూడా. ఇక నాలుగోరోజు ఆట సందర్భంగా.. ఇషాంత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఘర్షణకు దిగాడు. తనను ఇబ్బంది పెట్టేందుకు లంక బౌలర్ దమ్మిక ప్రసాద్ వరుసగా బౌన్సర్లు విసురుతుంటే.. వాటిని చిరునవ్వుతో ఇషాంత్ తప్పించుకుంటూ, నాలుగో బంతికి సింగిల్ తీశాడు. ఈ క్రమంలోనే బౌలర్ దగ్గరకు వెళ్లి.. ‘మరో బౌన్సర్ వేస్తావా?’ అంటూ తల చూపించాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ప్రసాద్.. ఇషాంత్ దగ్గరికి వెళ్లి ఏదో చెప్పగా.. అందుకు ఇషాంత్ సైతం కోపంగా సమాధానం చెప్పాడు. వీరిద్దరి మధ్య చండీమల్ వచ్చి నోరు జారడంతో.. అంపైర్లు కల్పించుకోవాల్సి వచ్చింది.

ఆ కథ అప్పటికి ముగిసిందనుకుంటే తప్పే. రెండో ఇన్నింగ్స్ లోనూ అలాగే కొనసాగింది. రెండో ఇన్నింగ్స్ లో భాగంగా చండీమల్ వికెట్ తీసిన ఆనందంలో ఇషాంత్ తనదైన శైలిలో ప్రదర్శించాడు. చండీమల్ అవుట్ కాగానే.. చేత్తో తన తలను బాదుకుంటూ సెండాఫ్ ఇచ్చాడు. అది చూసిన చండీమల్.. కోపంగా ఏదో అనుకుంటూ పెవీలియన్ చేరాడు. ఇక మరో సందర్భంలో తిరిమానే కూడా వాగ్వాదానికి దిగిన సందర్భం వుంది. ఇలా.. ప్రవర్తించిన నేపథ్యంలో ఇషాంత్ శర్మ, లంక ఆటగాళ్లు చండిమాల్, తిరిమానే, దమ్మిక ప్రసాద్ లపై క్రమశిక్షణా చర్యలను తీసుకోవాలని ఐసీసీ నిర్ణయించింది. ఆ ఘటనపై విచారణ జరిపి, ఆటగాళ్లపై చర్యలు తీసుకుంటామని ఐసీసీ అధికారులు పేర్కొన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ishant sharma  dhammika prasad  dinesh chandimal  lahiru thirimanne  india vs sri lanka  

Other Articles