MS Dhoni undergoing two-week Para training in Agra

Ms dhoni undergoing training with army s elite para brigade

India, MS Dhoni, dhoni Army Training, Elite Para Brigade, Lieutenant Colonel, Cricket MS Dhoni Undergoing Training With Army's Elite Para Brigade latest Cricket news, Mahendra Singh Dhoni, Sakshi Dhoni, Ziva, friendship day, Vipin Singh, MS Dhoni, lieutenant colonel honorary rank, army Training, indian cricket, New Delhi

MS Dhoni had written to the Army authorities to undertake the training and will do five parachute jumps once he finishes his course.

లెఫ్టినెంట్ కర్నల్ హోదాలో.. ధోని ఆర్మీ శిక్షణ..!

Posted: 08/07/2015 07:27 PM IST
Ms dhoni undergoing training with army s elite para brigade

టీమిండియా టి-20, వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సమయం ఆసన్నమైన తరుణంలో భారతమాత రుణం తీర్చుకునేందుకు గాను సన్నధమవుతున్నాడు. ఇందుకోసం ఆయన ప్రస్తుతం ఆర్మీ శిక్షణకు వెళ్లాడు. గతంలో భారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ హోదా పొందిన ధోనీ.. అదే హోదాలో శిక్షణను తీసుకుంటున్నాడు. దేశరాజధాని ఢిల్లీకి చేరువలోని ఆగ్రాలోని ఎలైట్ పారా రెజిమెంట్లో శిక్షణ తీసుకుంటున్నాడు. శిక్షణ తీసుకుంటానంటూ ఇటీవల ధోనీ ఆర్మీ ఉన్నతాధికారులకు లేఖ రాయడంతో వారు అనుమతించారు.

ఆగ్రాలోని పారా ట్రైనింగ్ స్కూల్లో ధోనీ రెండు వారాల పాటు శిక్షణ పొందనున్నాడు. ధోనీ శిక్షణ పొందిన తర్వాత ఐదు పారాచూట్ జంప్స్ చేయగలడని రక్షణ శాఖ ప్రతినిధి సీతాన్షు కర్ చెప్పారు. అయితే దోణిని తాము సర్వసాధారణ లెఫ్టినెంట్ స్థాయి అధికారి హోదాలోనే శిక్షణను కల్పిస్తున్నామని, ఆయనకంటూ ప్రత్యేకంగా ఎలాంటి మినహాయింపులు లేకుండా శిక్షణనందిస్తున్నామన్నారు. 2011లో భారత సైన్యం గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ హోదాతో ధోనీని గౌరవించి, కమెండో యూనిఫాం కూడా బహూకరించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  MS Dhoni  Army Training  Elite Para Brigade  lieutenant colonel  

Other Articles