Pravin Tambe gets into trouble for playing with banned Mohammad Ashraful

Pravin tambe likely to escape sanction for featuring in match with banned mohammad ashraful

IPL,T20 Cricket,Bangladesh Premier League,Rajasthan Royals Cricket,Indian Cricket, Bangladesh Cricket, Mohammad Ashraful, Pravin Tambe, Cricket

Pravin Tambe, who plays for Rajasthan Royals in the IPL, had gone to the US and played a T20 match which also featured banned Bangladesh player Mohammad Ashraful

వివాదంలో చిక్కుకున్న లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే

Posted: 08/06/2015 07:36 PM IST
Pravin tambe likely to escape sanction for featuring in match with banned mohammad ashraful

ఇటీవల కాలంలో వార్తల్లోని వ్యక్తిగా మారిన క్రీడాకారుడు, రాజస్థాన్‌ రాయల్స్‌కు చెందిన వెటరన్‌ లెగ్‌ స్పిన్నర్‌ ప్రవీణ్‌ తాంబే బిసిసిఐ క్రమశిక్షణా చర్యలను నుంచి తప్పించికున్నాడు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కేసులో వేటుపడిన బంగ్లాదేశ్‌ ఆటగాడు అష్రఫుల్‌తో కలసి అనుమతిలేని టీ-20 మ్యాచ్‌ ఆడటంపై ఆయనపై బిసిసిఐ ఏ విధమైన చర్యలు తీసుకుంటుందోనని ఎదురుచేస్తున్న క్రమంలో ఆయనపై జరిమానా విధించేందుకు బిసిసిఐ విముఖత చూపుతున్నట్లు సమాచారం. దీంతో బిసిసిఐ తీసుకుబోవు క్రమశిక్షణా చర్యల నుంచి ఆయన తప్పించుకున్నాడని వార్తలందుతున్నాయి

అమెరికాలోని న్యూ జెర్సీ ప్రాంతంలో జరిగిన లారెన్‌ హిల్‌ క్రికెట్‌ టోర్నీలో గత నెల 27న బుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌత్‌ గుజరాత్‌ సీసీ జూనియర్స్‌ తరఫున తాంబే, అష్రఫుల్‌ ఆడినట్లు సమాచారం. ఈ టోర్నీలో ఆడేందుకు ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ (ఎంసీఏ) నుంచి అనుమతి పొందలేదని తాంబే ఒప్పుకున్నాడు. అయితే తాంబే క్రమశిక్షణా చర్యలను తప్పించుకునేందుకు కూడా ఓ కారణం వుంది. అదేంటంటే అమెరికా అంతర్జాతీయ క్రికెట్ మండలిలో సభ్య దేశంగా లేనందున.. అ జట్టు తరుపున క్రికెట్ ఆడిన క్రీడాకారులపై చర్యలు తీసుకోవడానికి ఐసిసి నిరాకరించినట్లు తెలుస్తోంది. ఇటీవల జూన్ 26న జరిగిన వార్షిక సమావేశంలో అమెరికా క్రికెట్ అసోయేషన్ గుర్తింపును ఐసీసీ రద్దు చేసింది. అసోసియేషన్ లో పాలన గాడి తప్పుతున్నందునే ఐసీసీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohammad Ashraful  Pravin Tambe  escape  Cricket  

Other Articles