Mohammad Hafeez handed one-year ban for illegal action

Pakistan s mohammad hafeez banned from bowling

pakistan s mohammad hafeez banned from bowling, Mohammad Hafeez handed one-year ban for illegal action, cricket, mohammad hafeez, pakistan, suspended, icc, allrounder, Sports, Ramadan, ramzan festival, eid al fitr, ICC regulations, ICC Hafeez illegal bowling action

Pakistan's off-spinning all-rounder Mohamamd Hafeez was today banned from bowling in international cricket for 12 months, the International Cricket Council (ICC) said

రంజాన్ పర్వదినాన హఫీజ్ కు షాక్.. ఏడాది నిషేధం

Posted: 07/17/2015 11:44 PM IST
Pakistan s mohammad hafeez banned from bowling

అంతర్జాతీయ క్రికెట్ నుంచి మరో స్పిన్నర్ దూరం కానున్నాడు. అనుమానాస్పద బౌలింగ్ అంశమే ఇందుకు కారణమవుతోంది. పాకిస్ధాన్ ఆఫ్ స్నిన్నర్, ఆల్ రౌండర్ మొహమద్ హఫీజ్‌ బౌలింగ్‌ను నిషేధిస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుక్రవారం ప్రకటించింది. ఈనెల 6వ తేదీన చెన్నైలోని శ్రీ రామచంద్ర యూనివర్సిటీలో అతడి బౌలింగ్ యాక్షన్‌ను పరీక్షించిన ఐసీసీ.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి హాఫీజ్ ను  12 నెలలు పాటు నిషేధించింది. శ్రీలంకపై (జూన్ 17-21)న గాలెలో జరిగిన తొలి టెస్టులో మ్యాచ్ అఫీసియల్స్ మొహమద్ హఫీజ్ బౌలింగ్‌పై తమ సందేహాలను వెలిబుచ్చారు. మ్యాచ్ అనంతరం మొహమద్ హఫీజ్ ఐసీసీ రూల్స్ ప్రకారం తన బౌలింగ్ యాక్షన్‌పై చెన్నైలో పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షల్లో హఫీజ్‌ విఫలం కావడంతో అతడిపై ఏడాది పాటు ఐసీసీ నిషేదం విధించింది.

మొహమద్ హఫీజ్ బౌలింగ్ వేసే సమయంలో తన మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచుతున్నట్లు పరీక్షల్లో నిర్దారణ కావడంతో ఐసీసీ ఈ చర్యకు ఉపక్రమించింది. గతేడాది నవంబర్‌లో అబుదాబిలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌ మొదటి టెస్ట్‌లో హాఫీజ్‌ బౌలింగ్‌పై విమర్శలు రావడంతో అతని బౌలింగ్‌పై ఐసీసీ నిషేదం విధించింది. అయితే మళ్లీ ఏప్రిల్ 2015లో మరోసారి హఫీజ్ బోలింగ్‌పై మ్యాచ్ అఫీసియల్స్‌కు అనుమానాలు రేకెత్తడంతో పరీక్షకు హాజరవ్వాల్సిందిగా ఐసీసీ కోరింది. రెండేళ్ల వ్యవధిలో హపీజ్ రెండో పర్యాయం అనుమానాస్పద బౌలింగ్ వేయడంతో తొలిసారి సస్పెండ్ కు గురైన అతను రెండో పర్యాయం కూడా అనుమానస్పద బాలింగ్ వేయడంతో అంతర్జాతీయ క్రికెట్ నుంచి 12 నెలల పాటు నిషేధించబడ్డాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  mohammad hafeez  pakistan  suspended  icc  allrounder  Sports  

Other Articles