Cricket Legend Sir Viv Richards Says Future Of Indian Cricket Looks Bright in Virat Kohli's Hands | Mahendra Singh Dhoni

Indian cricket future looks bright in virat kohli hand viv richards

virat kohli, viv richards, mahendra singh dhoni, bcci, indian cricket batsmen, team india, india cricket team members, ms dhoni, virat kohli controversy, ms dhoni controversy, viv richards controversies, india cricket controversies

Indian Cricket future looks bright in virat kohli hand viv richards : West Indian cricket legend Sir Viv Richards is in awe of Virat Kohli's attitude and is ready to help out the Indian batsmen provided BCCI approached him.

ధోనీకి చురకలు.. కోహ్లీకి ప్రశంసలు

Posted: 07/06/2015 10:36 AM IST
Indian cricket future looks bright in virat kohli hand viv richards

టీమిండియా జట్టుకు ఎన్నో విజయాలు అందించిన కెప్టెన్ కూల్ ధోనీ.. గతకొన్నాళ్ల నుంచి విఫలమవుతుండటంతో విమర్శనాస్త్రాలను ఎదుర్కొంటున్నాడు. నిన్నటివరకు ధోనీకి జేజేలు కొట్టినవాళ్లే ఇప్పుడతనిపై నోటిదురుసు ప్రదర్శిస్తున్నారు. 28 ఏళ్ల భారతీయుల కలను ‘వరల్డ్ కప్-2011’ రూపంతో తీర్చడంతోపాటు టీ-20 వరల్డ్ కప్ ఇంకా ఎన్నో వన్డే మ్యాచులు గెలిపించిన విషయాలను విస్మయించి.. కేవలం ఓటములను మాత్రమే లెక్కగడుతూ అతనిని తిట్టిపారేస్తున్నారు. ఈ క్రమంలోనే టెస్టు జట్టు కెప్టెన్ కోహ్లీని ప్రశంసలతో ఆకాశానికెత్తేస్తున్నారు. ధోనీతో పోల్చితే కోహ్లీ బెటర్ కెప్టెన్ అని.. అతని సారథ్యంలో భారత్ జట్టు ఉన్నత శిఖరాలకు ఎగురుతుందని పేర్కొంటున్నార. ఈ తరహాలోనే తాజాగా మరో క్రికెట్ దిగ్గజం కోహ్లీని ప్రశంసిస్తూ ధోనీపై చురకలంటించాడు.

విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత క్రికెట్ కు ఉజ్వల భవిష్యత్ వుందని వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ అన్నాడు. కోహ్లీ బ్యాటింగ్ శైలి చాలా అద్భుతంగా వుంటుందని ప్రశంసించాడు. వన్డే, టీ-20 జట్ల కెప్టెన్ ధోనీతో పోలిస్తే టెస్టు కెప్టెన్ కోహ్లీ భిన్నంగా వుంటాడని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. మైదానంలో ధోనీ చాలా ప్రశాంతంగా కనిపిస్తాడని.. కానీ కోహ్లీ మాత్రం దూకుడుగా వుంటాడని పేర్కొన్నాడు. అంతేకాదు.. కోపంగా వుండే అతని స్వభావాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదని అన్నాడు. అతని థృక్పథంలో ఎలాంటి తప్పు కనిపించలేదని చెప్పాడు. ఇక.. ఇటీవల అతని విఫలంపై రిచర్డ్స్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ క్రికెట్ లో ఒడిదుడుకులు సహజమేనని.. తన ఆటను మెరుగుపరుచుకుంటాడని ఆయన పేర్కొన్నాడు. త్వరలోనే అతనిలో సరికొత్త మార్పును గమనిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశాడు.

రిచర్డ్స్ ఈ విధంగా ధోనీ, కోహ్లీని పోల్చుతూ చేసిన కామెంట్స్ అందరినీ సందిగ్ధతలో పడేసింది. ఆయన కామెంట్లను గమనిస్తుంటే.. ధోనీ మీద చురకలంటించినట్లుగానూ.. కోహ్లీని ప్రశంసలతో ఆకాశానికెత్తేశాడన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. మరి.. రిచర్డ్స కామెంట్లపై ధోనీ ఎలా స్పందిస్తాడోనని ఆసక్తిగా మరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  viv richards  mahendra singh dhoni  

Other Articles