Expected ODI call-up after doing well in Tests: Murali Vijay

Expecting odi call up after test success vijay

Zimbabwe vs India, Indian Cricket, Murali Vijay, Virat Kohli, Ajinkya Rahane, Cricket, india vs zimbabwe, zimbabwe tour 2015, india odi opener, murali vijay odi, latest cricket news

After being selected in the limited-overs series against Zimbabwe, India batsman Murali Vijay said following couple a good run in Tests, he expected to be called up in the One-Day matches

ఆ పిలుపు వస్తుందని ముందే ఊహించా

Posted: 06/30/2015 10:44 PM IST
Expecting odi call up after test success vijay

జింబావ్వే పర్యటనకు వెళ్లనున్న భారత జట్టులోని 15 మంది సభ్యుల తుది జట్టులో స్థానం సంపాదించడంతో సంతోషంలో వున్న ఇండియన్ ఓపెనర్ తమిళనాడు బ్యాట్స్ మెన్ మురళీ విజయ్.. తాను మళ్లీ వన్డేలలో చోటు సంపాదించగలనని ధీమాను వ్యక్వం చేశాడు. టీమిండియా తరపున జరిగిన టెస్టులలో బాగా రాణించడం ద్వారా తనకు భారత వన్డే జట్టులో స్థానం వస్తుందని ముందుగానే ఊహించాని అన్నాడు. అయితే ఈ అవకాశం రావడానికి టెస్టుల్లో తాను రాణించడం వల్లే సాథ్యమైందని, ఆ ఆత్మవిశ్వాసమే దోహదపడిందని అన్నారు.

జింబాబ్వే పర్యటనకు సీనియర్లకు బిసిసిఐ క్లియరెస్స్ ఇవ్వడంతో మహేంద్ర సింగ్ ధోని సహా ఐదుగురు సీనియర్లు రెస్టులో వుండటంతో మురళీ విజయ్ కు అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా మురళీ విజయ్ మాట్లాడుతూ.. వన్డే జట్టులోకి మళ్లీ రావాడం సంతోషంగా వుందన్నారు. 2013 ఛాంఫియన్స్ ట్రోఫి సహా నాలుగు సీరీస్ లకు మూడో ఓపెనర్ గా తనను జట్టులోకి తీసుకున్నా.. అప్పుడు అడే అవకాశం రాలేదని చెప్పాడు. మ్యాచ్ లలో ఆడకపోయినా తాను ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదని అన్నాడు. నిత్యం తనకు తానే పోటీ అనుకునే తన ఆటను మెరుగుపర్చుకున్నానని, ఇతరులను ఎప్పుడు పోటీగా భావించలేదని మురళీ విజయ్ అన్నాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Murali Vijay  Ajinkya Rahane  One-Day Internationals  Zimbabwe  

Other Articles