ICC confirms Lalit Modi's mail on Suresh Raina, Ravindra Jadeja and Dwayne Bravo | Ipl Betting Scam

Icc confirms lalit modis mail on suresh raina ravindra jadeja dwayne bravo ipl betting

ipl betting, lalit modi scam betting, lalit modi fixing scam, lalit modi letter to icc, lalit modi reveals betting players, lalit modi incident, dwayne bravo, betting scam, suresh raina fixing, ravindra jadeja fixing

ICC confirms Lalit Modis mail on Suresh Raina Ravindra Jadeja Dwayne Bravo Ipl Betting : The International Cricket Council (ICC) on Sunday confirmed to TOI through a spokesperson that its chief executive, David Richardson, had indeed received a letter from former IPL boss Lalit Modi in June 2013 informing him about a leading Mumbai-based builder making lavish gifts to the tune of Rs 60 crore to three international cricketers.

రైనా, జడేజాల బెట్టింగ్ పై మోదీ మెయిల్ నిజమే!

Posted: 06/29/2015 11:59 AM IST
Icc confirms lalit modis mail on suresh raina ravindra jadeja dwayne bravo ipl betting

‘లలిత్ మోడీ’ స్కామ్ వ్యవహారం బయటపడిన నేపథ్యంలో మరిన్ని సంచలనాలు ఒక్కొక్కొటిగా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో క్రికెట్ రంగాన్నే హడలెత్తించిన ‘ఐపీఎల్ ఫిక్సింగ్’ ఇప్పుడు మళ్లీ వార్తల్లోకెక్కింది.

2013లో సంచలనం సృష్టించిన ఈ ఫిక్సింగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యులుగా వున్న రవీంద్ర జడేజా, సురేష్ రైనా, బ్రావోలు హస్తముందని.. వారు ముగ్గురు మ్యాచ్ ఫిక్స్ చేసేందుకు బుకీల నుంచి పెద్దయెత్తున డబ్బు స్వీకరించినట్లు ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ తన ట్విటర్ ఖాతాలో ఆరోపించాడు. దీంతో ఇది అప్పట్లో తీవ్ర కలకలం సృష్టించింది. కానీ.. దీనిపై బీసీసీఐ వర్గాలు అప్పట్లో స్పందించలేదు. అయితే.. లలిత్ మోదీ స్కామ్ వెలుగులోకి రావడంతో.. ఆ బెట్టింగ్ వ్యవహారం మళ్లీ వెలుగులోకొచ్చింది.

ముగ్గురు ఐపీఎల్ ఆటగాళ్లు అయిన జడేజా, రైనా, బ్రావోలు బెట్టింగ్ కు సహకరించినట్లు మోదీ తమకు మెయిల్ పంపిన వాస్తవమేనని ఐసీసీ అంగీకరించింది. ఆ సమాచారాన్ని తాము అప్పుడే ఐసీసీ అవినీతి నిరోధక విభాగానికి పంపామని, అలాగే బీసీసీఐ అవినీతి నిరోధక అధికారులకు కూడా చేరవేశామని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే.. ఆ వ్యవహారంపై వారేమి చర్యలు తీసుకున్నారన్న విషయంపై తమకు తిరిగి సమాచారం రాలేదని ఐసీసీ పేర్కొంది.

ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తుంటే.. ఐపీఎల్ బెట్టింగ్ విషయమై మరోసారి దర్యాప్తు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దర్యాప్తులో ఆ చెన్నై ఆటగాళ్లు బెట్టింగ్ కు పాల్పడ్డారా..? లేదా..? లలిత్ మోదీ అబద్ధం చెప్పారా..? అనే అంశాలు అప్పుడు బయటపడుతాయి. అప్పటివరకు వేచి చూడాల్సిందే!

AS

lalit-modi-letter

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lalit modi  suresh raina  ravindra jadeja  dwayne bravo  ipl fixing  

Other Articles