ICC suspends USACA over 'significant concerns'

Icc board suspends usa cricket association

ICC Board suspends USA Cricket Association, Cricket, ICC, Sports, USA Cricket Association, USACA, USA Cricket Association, governance, finance, reputation, cricketing activities, cricketing challenges, ICC chairman N Srinivasan, ICC World Twenty20, Qualifier 2015, Ireland and Scotland, USA U-19 team, U19 Championship, Bermuda.

The ICC Board has unanimously decided to suspend the membership of the USA Cricket Association (USACA) with immediate effect during its ICC Annual Conference week that concluded here.

అమెరికా క్రికెట్ అసోసియేషన్ పై ఐసిసి వేటు..

Posted: 06/27/2015 08:09 PM IST
Icc board suspends usa cricket association

బార్బోడాస్‌ వేదికగా ఎన్.శ్రీనివాసన్ అధ్యక్షతన శనివారం జరిగిన ఐసీసీ వార్షిక స్థాయి సమావేశంలో యూనైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆమెరికా కు చెందిన క్రికెట్ అసోసియేషన్ గుర్తింపును సస్సెండ్ చేస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ రద్దు తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపింది. ఐసిసి అర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లోని ఆర్టికల్ 2.7 కింద యూఎస్ఎ క్రికెట్ అసోసియేషన్ గుర్తుంపును రద్దు చేస్తున్నట్లు ఐసిసి చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ తెలిపారు. యూఎష్ఏసీఏను సస్సెండ్ చేస్తూ నిర్ణఃయం తీసుకునే క్రమంలో అన్ని అంశాలను క్షణ్ణంగా పరిశీలించిన తరువాతే తాము ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు.

క్రికెట్ వ్యవహరాలు, వాటి నిర్వహణ, ఆర్థక లావాదేవీలు, రిఫ్యూటేషన్ తదితర అంశాల విషయంతో అభ్యంతరాలను వ్యక్తం చేసిన ఐసీసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ మేరకు పరిశీలన బృందం సమర్పించిన నివేదికతో పాటు 100 మంది స్టేక్ హోల్డర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తరువాతే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చైర్మన్ ఎన్ శ్రీనివాసన్ తెలిపారు. అమెరికాలో క్రీకెట్ అభివృద్దికి ఇతోధిక వనరులు వున్నా వాటి వినియోగం సక్రమంగా సాగడం లేదని శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు.

ఐసీసీ సస్పెన్షన్ తో యూనైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా కు అంతర్జాతీయ క్రికెట్ మండలి నుంచి నిర్ధేశించిన నిధులు రాకపోవడంతో పాటు.. అమెరికాలో మ్యాచ్ లు ఎక్కడ, ఎప్పుడు. ఎలా ఏర్పాటు చేయాలన్న అంశాలపై కూడా యూఎస్ఏసిఏ జోక్యం చేసుకునేందుకు వీలుండదు. అయితే క్రికెట్ అసోసియేషన్ ను రద్దు చేసిన ఐసీసీ.. అమెరికాలోని క్రికెట్ క్రీడాకారులను మాత్రం కరుణించింది. వచ్చే నెలలో స్కాట్లాండ్, ఐర్లాండ్ లలో జరగనున్న టీ-20 వరల్డ్ కప్ క్వాలిఫర్ మ్యాచ్ లలో వారిని అడేందుకు అనుమతినిచ్చింది. దీనికి తోడు బర్ముడాలో జరగనున్నా అండర్ 19 ఛాంఫియన్ షిఫ్ పోటీలలో కూడా అమెరికాకు అండర్ 19 క్రికెట్ జట్టుకు అనుమతినిచ్చింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc criket world cup 2015  Ireland  zimbamwe  

Other Articles