Pakistan Former Captain Zaheer Abbas confirmed as ICC president | International Cricket Council

Pakistan former captain zaheer abbas confirmed as icc president

zaheer abbas, zaheer abbas news, n srinivasan, icc president, icc president zaheer abbas, icc presidents list, zaheer abbas news, zaheer abbas wiki, international cricket council

Pakistan Former Captain Zaheer Abbas confirmed as ICC president : Former Pakistan batsman Zaheer Abbas was confirmed as ICC president on the third day of the ICC annual conference in Barbados. Abbas, who had been chosen for the post by the PCB, thanked the ICC for accepting his nomination.

ఐసీసీ అధ్యక్ష పదవి @ పాక్ మాజీ కెప్టెన్

Posted: 06/25/2015 04:44 PM IST
Pakistan former captain zaheer abbas confirmed as icc president

ఐసీసీ అధ్యక్ష పదవి ఎవరికి వరిస్తుందా..? అన్న సందేహానికి తెరపడింది. క్రికెట్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆ పదవి.. ప్రపంచంలో వుండే ఎందరో వ్యక్తుల్ని పరిశీలించి చివరకు పాక్ మాజీ కెప్టెన్ ని వరించింది. ఆయన పేరు జహీర్ అబ్బాస్. బార్బాడోస్ లో జరిగిన ఐసీసీ వార్షిక సదస్సులో అధ్యక్ష పదవికి ఆయన్ను ఎన్నుకున్నట్టు ఒక ప్రకటన వెలువడింది. వెంటనే ఆయన కూడా ఓ సంవత్సరంపాటు సేవలందించేలా జహీర్ బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా జహీర్ మాట్లాడుతూ.. ‘క్రికెట్ నియంత్రణా మండలికి అధ్యక్ష బాధ్యతలు లభించడం నాకు ఎంతో ఆనందంగా వుంది. ఈ ఆట వివిధ దేశాలమధ్య స్నేహ, గౌరవ బంధాలను పెంచుతోంది. పలు దేశాలకు సేవలు అందించే అవకాశం లభించడం నాకెంతో గర్వకారణంగా అనిపిస్తోంది. ఈ పదవిలో కొనసాగేంతకాలం బాగా సేవలందించడంలో తీవ్ర కృషి చేస్తా’ అని అన్నారు. ఇక ఈ అధ్యక్ష పదవి దక్కేలా తన పేరును సిఫార్సు చేసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఆయన కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఈయన ఎన్నికపై పాకిస్థాన్ క్రికెట్ అభిమానులతోపాటు క్రికెట్ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈయన గురించి బీసీసీఐ బోర్డు సభ్యుడు శ్రీనివాసన్ మాట్లాడుతూ.. జహీర్ ఒక గొప్ప క్రికెటరని కొనియాడారు.

ఇదిలావుండగా.. పాక్ జట్టు తరఫున జహీర్ 78 టెస్టులు, 62 వన్డే మ్యాచులు ఆడారు. 1969 నుంచి 1985 మధ్యకాలంలో ఆడిన ఆయన.. మడు ప్రపంచకప్ పోటీలకు పాక్ తరఫున ప్రాతినిధ్యం వహించారు. వన్డేల్లో 2,572, టెస్టుల్లో 5,062 పరుగులు చేశారు. ఆసియన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 100 సెంచరీలను దాటిన ఘనమైన రికార్డు అతని పేరిటే వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : zaheer abbas  icc president  n srinivasan  

Other Articles