Madhya Pradesh HC admits PIL against Sachin Tendulkars Bharat Ratna | Sachin Advertisements

Madhya pradesh hc admits pil against sachin tendulkars bharat ratna

sachin tendulkar, bharat ratna, madhya pradesh high court, MP HC, country highest honour, supreme court of india, bharat ratna award, sachin tendulkar controversy, sachin tendulkar updates

Madhya Pradesh HC admits PIL against Sachin Tendulkar's Bharat Ratna : Madhya Pradesh High court has Thursday admitted a PIL alleging misuse of 'Bharat Ratna' in commercial advertisements by Sachin Tendulkar and directed assistant solicitor general to find out if there are any Supreme Court guidelines on use of award of promotion of commercial products by awardees of country's highest honour.

సచిన్ ‘భారతరత్న’కు ముప్పుతెచ్చిన యాడ్స్

Posted: 06/19/2015 01:27 PM IST
Madhya pradesh hc admits pil against sachin tendulkars bharat ratna

టీమిండియా మాజీ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ ఇచ్చిన అనంతరం ఆయనకు భారత ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’తో సత్కరించిన విషయం తెలిసిందే! అయితే.. ఇప్పుడా పురస్కారానికి ఆయన చేస్తున్న వాణిజ్య ప్రకటనలు కాస్త ముప్పుగా మారాయి. రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత సచిన్ వరుసగా వాణిజ్య ప్రకటనలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆయన కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. అలాగే తన పురస్కారాన్ని ఇరకాటంలో పడేయాల్సి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. సచిన్ పై భోపాల్ కి చెందిన వీకే నస్వహ అనే వ్యక్తి మధ్యప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశాడు. సచిన్ ఇప్పటికీ పలు టీవీ ప్రకటనలు చేస్తున్నందుకుగానూ తన భారతరత్న పురస్కారాన్ని తిరిగి ఇచ్చేయాలని పిల్ లో కోరాడు. సదరు స్టార్ క్రికెటర్ వాణిజ్య ప్రకటనల్లో కనిపిస్తూ తన గౌరవాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని అతగాడు పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే సచిన్ కు ప్రదానం చేసిన అవార్డును ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని.. లేకపోతే స్వయంగా సచినే ప్రభుత్వానికి తరిగి ఇచ్చేయాలని పిటిషనర్ సూచించాడు.

ఈ విధంగా అతగాడు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు.. సచిన్ ప్రకటనల్లో కనిపించడానికి సంబంధించి అడ్డుచెప్పే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏమైనా వున్నాయేమో పరిశీలించాలని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ను ఆదేశించింది. ఒకవేళ లేకపోతే.. సచిన్ ‘భారతరత్న’ వెనక్కు తిరిగి ఇచ్చే పరిస్థితి నెలకొనే అవకాశం వుందని అనుకుంటున్నారు. ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sachin tendulkar  bharat ratna  madhya pradesh high court  

Other Articles