2 killed in suicide blast near Gaddafi stadium in Pakistan

Two killed in suicide blast outside pakistan stadium

suicide blast, Pakistan and Zimbabwe, second one day international, second ODI match, Gaddafi cricket Stadium, lahore, sub-inspector killed, six injured in suicide blast, match uninterrupted amid explosions, Pakistan, Zimbabwe, sub-inspector Abdul Majid, touring Zimbabwe team, Taliban attack, Sri Lankan cricket team, 2009

A sub-inspector was killed and six others injured after a suicide blast outside a stadium in Lahore where the second ODI match between Pakistan and Zimbabwe was ongoing.

పాక్, జింబాంబ్వే మ్యాచ్ లక్ష్యంగా ఆత్మాహుతి దాడి, ఇద్దరు మృతి

Posted: 05/30/2015 08:38 PM IST
Two killed in suicide blast outside pakistan stadium

పాకిస్థాన్ లోని లాహోర్ లో మరోమారు ఉగ్రవాదులు మళ్లీ పేట్రేగిపోయారు. పాకిస్థాన్, జింబాబ్వేల మధ్య జరుగుతున్న రెండవ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఘటన ఆసల్యంగా వెలుగుచూసింది. శుక్రవారం లాహోర్లోని గడాఫీ స్టేడియంలో ఈ రెండు జట్లు రెండో వన్ డే ఇంటర్నేషన్ మ్యాచ్ ఆడాయి. మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదిని పోలీసులు అడ్డుకోవడంతో ఆ ఉగ్రవాది అక్కడిక్కడే తనను పేల్చుకున్నాడు.

ఈ దాడిలో ఒక  ఎస్సై అబ్దుల్ మజీద్ మరణించగా, ఆరుగురు పోలీసులకు గాయాలయ్యాయి. అనుమానం రావడంతో ఎస్ ఐ అబ్దుల్ మజీద్ ఆత్మహుతి సభ్యుడిని. అడ్డుకోగా, అతను అక్కడిక్కడే తనను తాను పేల్చుకోవడంతో.. ఎస్ ఐ సహా మరో సౌరుడు మరణించాడు. సుమారు 20 వేల మంది ప్రేక్షకులు వున్న స్టేడియంలోకి ప్రయత్నించిన ఉద్రవాద అత్మహుతి సభ్యుడిని అడ్డుకుని అమరుడైన ఎస్ ఐ అబ్దుల్ మజీద్ ను స్థానికులు కీర్తిస్తున్నారు. 2009లో సరిగ్గా గఢాఫీ స్టేడియంలో మ్యాచ్ అడేందుకు వెళ్తున్న శ్రీలంక జట్టు సభ్యులపై అప్పట్లో ఉద్రవాదులు కాల్పులు జరిపారు. ఆ తరువాత గత ఆరేళ్లుగా పాకిస్థాన్ లో ఎలాంటి మ్యాచ్ లు ఆడేందుకు ఏ దేశం కూడా అంగీకరించలేదు.

ఈ నేపథ్యంలో సుమారు ఆరేళ్ల తరువాత పరిస్థులు మారాయని భావించిన జింబాంబ్వే జట్టుకు పాకిస్థాన్ నుంచి పూర్తిస్థాయి భద్రత హామీ కల్పిస్తామన్న భరోసాలతో పర్యటిస్తోంది. పాకిస్థాన్ లో క్రికెట్ ఆడేందుకు సమ్మతిని తెలపడంతో పాటు ఇప్పటికే పలు మ్యాచ్ లను కూడా ఆడింది. ఈ క్రమంలో నిన్న జరిగిన మ్యాచ్ లో మరోమారు ఉగ్రవాదులు ఆత్మహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ సారి కూడా మళ్లీ గఢాఫీ స్టేడియం సమీపంలో ఉగ్రదాడి జరిగింది. విషయం బయటికి వస్తే తమ దేశం పరువు మరింత దిగజారుతుందని భావించిన పాక్ ప్రభుత్వం సంబంధిత వార్తలను ప్రసారం చెయ్యొద్దని బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ను ఆదేశించడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా ఆత్మహుతి దాడి జరగిన తరువాత కూడా జింబాంబ్వే తన పాకిస్థాన్ పర్యటనను కోనసాగిస్తామని తేల్చిచెప్పింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : suicide blast  Gaddafi cricket Stadium  lahore  

Other Articles