irat Kohli needs to learn to control his emotions: Bishan Singh Bedi

We need a strong coach to control virat kohli s temperament says bishan singh bedi

Virat Kohli,Cricket Virat Kohli Needs a Strong Coach to Control his Temperament: Bishan Singh Bedi latest Cricket news

Virat Kohli's "aggressive attitude" which has been hyped up by the media has not gone down well with Bishan Singh Bedi.

విరాట్ ను కంట్రోల్ చేసే కెప్టెన్ భారత్ కు అవసరం

Posted: 05/22/2015 08:12 PM IST
We need a strong coach to control virat kohli s temperament says bishan singh bedi

టీమిండియాకు ధృడమైన కోచ్ నియమించాల్సిన అవసరముందని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడి అభిప్రాయపడ్డారు. దూకుడు స్వభావంతో మైదానంలో వివాదాలు ఎదుర్కొంటున్నఆటగాళ్లను కోచ్ సమర్ధవంతంగా నియంత్రించాలని అలాంటి కోచ్ అవసరమే ప్రస్తుతం టీమిండియాకు అవసరమని ఆయన తన మనస్సులోని మాటను భయటపెట్టాడు. టీమిండియాలో మరీ ముఖ్యంగా విరాట్ కోహ్లిని కంట్రోల్ చేయాలంటే శక్తిమంతుడైన కోచ్ కావాలని ఆయన పేర్కొన్నారు.

విరాట్ కు మంచి కోచ్ కావాలని.. అతడిని గైడ్ చేయగలగాలని బిషన్ సింగ్ బేడీ అన్నాడు. కోహ్లి దుందుడుకు స్వభావాన్ని కోచ్ కంట్రోల్ లో పెట్టగలగితే.. కోహ్లీ నుంచి మనం చూస్తున్న దానికన్నా మరింత అధిక క్రీడను రాబట్టవచ్చని అన్నారు. క్రికెట్ లో ఎక్కువ కాలం కొనసాగాలంటే జగడాలమారి వైఖరిని కోహ్లి మార్చుకోవాల్సిన అవసరముంది' అని బేడి అభిప్రాయపడ్డారు. విరాట్ కోహ్లిని మీడియా నాశనం చేస్తోందని బిషన్ సింగ్ బేడి మండిపడ్డారు. అతడి దూకుడు స్వభావాన్ని ఒక వర్గం అతిగా చూపించడాన్ని ఆయన తప్పుబట్టారు. ధోని రిటైర్మెంట్ ప్రకటించడంతో టీమిండియా టెస్టు కెప్టెన్సీ కోహ్లికి అప్పగించారు. ఈ తరుణంలో ఆయనకు మంచి కోచ్.. గైడెన్స్ అవసరమని బేడి పేర్కోన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aggressive attitude  Virat Kohli  Bishan Singh Bedi  

Other Articles