Justin Langer | indian coach | Team India | Former Australia opening batsman

Justin langer rules himself out of the job to coach team india

Justin Langer, indian coach, Team India, Former Australia opening batsman Justin Langer

Former Australia opening batsman Justin Langer on Tuesday ruled himself out of the running for the vacant England coaching job by signing a new contract with Western Australia.

టీమిండియా కోచ్ బాబితాలో నేను లేను

Posted: 05/19/2015 06:08 PM IST
Justin langer rules himself out of the job to coach team india

భారత క్రికెట్ జట్టు కోచ్ జాబితాలో తాను వున్నట్లు వచ్చిన వ్యాఖ్యలతో విస్మయం చెందిన మాజీ అస్ట్రేలియా ఓపెనర్ బ్యాట్స్ మెన్ జస్టిన్ లంగర్ తాను ఇండియా, ఇంగ్లాండ్ క్రికెట్ జట్లకు కోచ్ గా వ్యవహరించే జాబితాలో లేనంటూ కుండబద్దలు కోట్టారు. ఇటీవల జరిగిన ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంటులో ఘోర వైఫల్యంతో పరాభవాన్ని చవిచూసిన ఇంగ్లాండ్ జట్టుకు కోచ్ గా తన పేరు జాబితాలో వుందని వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. ఇంగ్లండ్ కోచ్ పీటర్ మెరస్ స్థానంలో లంగర్ ను తీసుకోనున్నారన్న వార్తలను అయన ఖండించారు.

పీటర్ మెరిస్ స్తానంలో ఇంగ్లాండ్ క్రీడాకారుడు అండ్రీస్ స్టారిస్ భర్తీ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడిన లంగర్.. తాను దక్షిణ అస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్ తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని మరో రెండేళ్ల పాటు పోడగించుకున్నానని చెప్పారు. ఈ నేపథ్యంలో తాను ఇండియాకు, గానీ లేక ఇంగ్లాండ్ కు గానీ జట్టు కోచ్ గా వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. అయితే తనకు వచ్చిన ఈ అరుదైన అవకాశాలతో తాను సంతోషపడ్డానని చెప్పారు. అంతర్జాతీయంగా తనకు వచ్చిన కోచింగ్ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నానని చెప్పారు.

తనకు లభించిన అంతర్జాతీయ అవకాశాలను జారవిడుచుకుంటున్నందుకు చింతిస్తున్నానని, తన 20 ఏళ్ల క్రికెట్ ప్రాయంలో.. ఆట కోసం ఎంతగా కమిట్ మెంట్ అవసరమన్న విషయం తనకు తెలుసునని, అయితే అదే సమయంలో తన కుటంబంతో పాటు 12 మాసాల పాటు దూరంగా వుండేందుకు కూడా తనకు అవకాశాలు లేవన్నారు. అయితే రెండేళ్ల తరువాత మరోమారు తనకు అవకాశాలు వస్తే అప్పడు పరిశీలిస్తానని జస్టిన్ లంగర్ అభిప్రాయపడ్డారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Justin Langer  indian coach  Team India  Former Australia opening batsman  

Other Articles