Virat Kohli gets into argument with umpire Kumar Dharmasena goes controversy

Virat kohli gets into argument with umpire kumar dharmasena goes controversy

virat kohli, dinesh karthik, virat kohli controversy, virat kohli updates, dinesh karthik controversy, Kumar Dharmasena, hyderabad sunrisers, bangalore royal challengers

Virat Kohli gets into argument with umpire Kumar Dharmasena goes controversy : Royal Challengers Bangalore skipper Virat Kohli along with glovesman Dinesh Karthik got into a heated argument with umpire Kumar Dharmasena as the match officials continued with final two overs of Sunrisers Hyderabad innings despite steady drizzle.

‘కోపం’ వచ్చింది కదాని ఎగబడితే.. చర్యలు తప్పవు కోహ్లీ!

Posted: 05/16/2015 03:33 PM IST
Virat kohli gets into argument with umpire kumar dharmasena goes controversy

టీమిండియా యువక్రీడాకారుడు, టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి కోపమెక్కువన్న సంగతి ముందునుంచి అందరికీ తెలిసిందే! ఇతనికి సంబంధించిన వ్యవహారాల్లో ఏమైనా అంటే చాలు.. మనోడికి కోపం కట్టలు తెంచుకుని వచ్చేస్తుంది. తనను ఎంతగానో అభిమానించే ఫ్యాన్స్ ని సైతం మనోడి కోపానికి బలయ్యారు కూడా! తన తీరు మార్చుకోవాలంటూ ఎందరో చెప్పినప్పటికీ.. మనోడు రెచ్చిపోతున్నాడే తప్ప తన కోపాన్ని అదుపు పెట్టుకోలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే మనోడు అంపైర్ మీద తన కోపాన్ని ప్రదర్శించి.. ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లు కనిపిస్తోంది.

ఐపీఎల్-8 సందర్భంగా శుక్రవారం రాత్రి హైదరాబాదులో జరిగిన మ్యాచులో సన్ రైజర్స్ మీద బెంగుళూరు విజయం సాధించారు. అయితే.. దానికంటే ముందు ఈ మ్యాచ్ కి వరుణుడు పలుమార్లు అడ్డుపడ్డాడు. ఈ నేపథ్యంలోనే ఆటను 11 ఓవర్లకు కుదించారు. హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ కు దిగగా.. 10వ ఓవర్లో మరోసారి వర్షం మొదలైంది. 11 ఓవర్ వచ్చేవరకు బాగా కురవడం ప్రారంభమైంది. అయితే.. అంపైర్లు మాత్రం మ్యాచ్ ని నిలబెట్టకుండా అలాగే కొనసాగించేశారు. దీంతో బెంగుళూరు ఆటగాళ్లు కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షంలో బంతి పూర్తిగా తడిసిపోవడంతో అది చేతికి సరిగ్గా దొరకేతి కాదు. ఫలితంగా వాళ్లు మిస్ ఫీల్డ్ చాలా ఎక్కువ చేశారు. క్యాచులు సైతం మిస్ చేసేశారు. చివరికీ కోహ్లీ కూడా మిస్ ఫీల్డ్ చేసి పరుగులు సమర్పించాడు. అంతే! మనోడికి ఆగ్రహం తీవ్రస్థాయిలో వచ్చేసింది.

హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే అంపైర్ కుమార ధర్మసేనతో కోహ్లీ వాగ్వాదానికి దిగాడు. వర్షం పడుతుంటే ఆటను ఎందుకు ఆపలేదని అంపైర్ మీద తన నోటివాటం ప్రదర్శించాడు. ఈ క్రమంలోనే తనదైన స్టైల్లో కోహ్లీ మైదానంలోనే బాగా రెచ్చిపోయాడు. ఇక పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు.. కోహ్లీ రెచ్చిపోవడానికి చూసి దినేష్ కార్తీక్ సైతం మైదానంలోనే అంపైర్లతో గొడవకు దిగి పెద్దగానే అరిచేశాడు. పవెలియన్ చేరుదాకా కార్తీక్ తన మెంటాలిటీ ప్రదర్శిస్తూ వెళ్లాడు.

ఇలా ఈ విధంగా వీరిద్దరూ మైదానంలోనే అంపైర్లతో వాగ్వాదానికి దిగిన వ్యవహారాన్ని మ్యాచ్ రిఫరీలు చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. మైదానంలో అంపైర్ల నిర్ణయాన్ని ప్రశ్నించినందుకు వీరిద్దరిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం! కోపాన్ని అదుపులో వుంచుకోకుండా దురుసుగా ప్రవర్తిస్తే.. కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని మందిలించినట్లు చెప్పుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  dinesh karthik  kumar dharmasena  

Other Articles