Virat Kohli likely to skip India tour of Bangladesh 2015

India squad for bangladesh tour to be chosen on may 20

ajinkya rahane, anurag thakur, bangladesh, bcci, cheteshwar pujara, india tour of bangladesh 2015, virat kohli, team india, bangladesh, virat kohli, india tour of bangladesh 2015, mumbai, bcci, cricket, india, bangladesh, sandeep patil, bangladesh vs india 2015, bangladesh vs india, India cricket, IPL 8, latest IPL 8 news, Play-offs, IPL 8, IPL 2015, IPL, cricket news, IPL 8

The Indian squad for next month's tour of Bangladesh is to be picked by the national cricket selection panel headed by Sandeep Patil on May 20.

బంగ్లా టూర్: 20న జట్టు ఎంపిక.. రెస్టు కోరుతున్న సీనియర్లు

Posted: 05/15/2015 06:30 PM IST
India squad for bangladesh tour to be chosen on may 20

అస్ట్రేలియా టూర్ కు వెళ్లినప్పటి నుంచి టీమిండియా ఆటగాళ్లకు అసలు తీరిక లేకుండా పోయింది. అస్ట్రేలియా టూర్ తరువాత వెనువెంటనే ముక్కోణపు టోర్నమెంటు, ఆ తరువాత ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటు, ఆ తరువాత స్వదేశానికి వచ్చిరాగానే ఇండియన్ ప్రీమియర్ లీగ్ తో బిజీగా గడుపుతున్న టీమిండియా ఆటగాళ్లు ఆ తరువాత బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనున్నారు. అయితే బంగ్లాదేశ్ టూర్ నుంచి విశ్రాంతి తీసుకోవాలని పలువురు క్రికెటర్ల ఆలోచనగా వుందని తెలుస్తుంది. కొత్తగా పెళ్లైన సురేష్ రైనా తో పాటు త్వరలో తన చిన్ననాటి స్నేహితురాలిని పరిణయం ఆడబోతున్న రోహిత్ శర్మలతో పాటు భారత విధ్వంసకర బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ పేర్లు కూడా ఈ జాబితాలో వున్నట్లు తెలుస్తుంది. కాగా, బంగ్లాదేశ్ పర్యలనకు వెళ్లనున్న టీమిండియాను ఈ నెల 20న బిసిసిఐ ప్రకటించనుంది.

20న భారత క్రికెట్ నియంత్రణ మండలి జాతీయ సెలెక్షన్ కమిటీ ముంబాయిలోని క్రికెట్ సెంటర్ లో సమావేశమై జట్టును ఎంపిక చే్స్తుందని బిసిసీఐ వర్గాలు తెలిపాయి.బంగ్లా టూర్ లో భారత జట్టు ఒక టెస్టుతో పాటు మూడు వన్డేలను ఒక టీ 20 మ్యాచ్ ను అడనుంది. అయితే టెస్టు క్రికెట్ నుంచి టీమిండియా సారధి మహేంద్ర సింగ్ ధోణి విడ్కోలు పలకడంతో విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తారా లేక మరెవరినైనా టెస్టు క్రికెట్ కెప్టెన్ గా బిసిసిఐ నియమిస్తుందా అన్నది వేచి చూడాల్సిందే.

అటు దేశవాలీ క్రికెట్ సర్క్యూట్ లో మార్పులు చేర్పులు చేయాల్సిన అంశంపై అనిల్ కుంబ్లే నేతృత్వంలోని బిసిసీఐ టెక్నికల్ కమిటీ ఈ నెల 19న సమావేశం కానుంది. రంజీ ట్రోఫీ మ్యాచ్ లలో అధిక శాతం ఫలితాలు వచ్చేందుకు కొన్ని ప్రతిపాదనలు ఈ సాంకేతిక పరమైన అంశాలను పరిశీలించే కమిటీ బోర్డుకు నివేదించనుంది. పాయింట్ల ఫార్మాట్, రోజుకు బౌల్ చేయాల్సిన ఓవర్ల సంఖ్య వంటి అంశాలు ఈ ప్రతిపాదనల్లో చోటుచేసుకున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sachin Tendulkar  Shane Warne  IPL  vetaran cricketers  

Other Articles