Bravo says pressure situations get the best out of him

Bravo says chennai super kings can win macthes even at difficult times

Bravo says pressure situations get the best out of him, IPL 8, IPL 8 Just In, IPL 8 News, Dwayne Bravo, Brad Hogg, MS Dhoni, sunil narine, Brendon McCullum, Chennai Super Kings (CSK), Kolkata Knight Riders (KKR)

Allrounder dwayve bravo said he liked pressure situations as it brings the best out of him

ప్రతికూలతను ఎదురించి రాణించగలం

Posted: 04/29/2015 06:43 PM IST
Bravo says chennai super kings can win macthes even at difficult times

ఐపీఎల్ మ్యాచ్లో ఎలాంటి ప్రతికూల పరిస్థితి ఎదురైనా తమ జట్టు పుంజుకుని గెలవగలదనే నమ్మకముందని చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ డ్వెన్ బ్రావో అన్నాడు. చెన్నై కెప్టెన్ ధోనీని బ్రావో ప్రశంసించాడు. ప్రపంచ అత్యుత్తమ కెప్టెన్లలో ధోనీ ఒకడని కితాబిచ్చాడు. ఐపీఎల్-8లో చెన్నై ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఆరు విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. నిన్న రాత్రి కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన ఉత్కంఠకర పోరులో చివరి క్షణంలో చెన్నై2 పరుగులతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 134 పరుగులే చేయగలిగింది. దీంతో కోల్కతా గెలుస్తుందని భావించారు. లక్ష్యసాధనలో ఓ దశలో కోల్కతా విజయం దిశగా సాగింది. అయితే చెన్నై బౌలర్లు కీలక సమయంలో వికెట్లు తీసి తక్కువ లక్ష్యాన్ని కాపాడుకున్నారు. మీ విజయ రహస్యమేంటన్న ప్రశ్నకు బ్రావో బదులిస్తూ.. 'అత్యుత్తమ కెప్టెన్, కోచ్ లే తమ విజయానికి కారణమన్నారు. అంతేగాక తమ జట్టులో నలుగురు అంతర్జాతీయ కెప్టెన్లు ఉన్నారు. వారి సలహాలు కూడా జట్టుకు ఉపయోగపడుతాయి. ధోనీ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ మంచి ఫలితాలు రాబడుతాడు. మ్యాచ్ ఏలాంటి ప్రతికూల పరిస్థితిలో ఉన్నా గెలవగలమనే నమ్మకం తమకుందని బ్రావో అన్నాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL 8  Dwayne Bravo  Chennai Super Kings (CSK)  

Other Articles