New father of the nation': Jonty Rhodes names newborn daughter India, trends on Twitter

Jonty rhodes blessed with baby girl born natural water birth

jonty rhodes blessed with baby girl born natural water birth, New father of the nation': Jonty Rhodes names newborn daughter India, trends on Twitter, Baby girl, daughter, India, Jonty Rhodes, New born, Sports, trending, Twitter, cricket, tema india, jonty rhodes, south africa, ipl, fielding coach of Mumbai Indians, Santacruz, Mumbai, India Jeanne Jonty Rhodes.

It's a water baby for former South African cricketer Jonty Rhodes whose wife Melanie Jeanee delivered at a Santa Cruz hospital on Thursday afternoon. The couple have named their daughter, born in the midst of the IPL cricketing season, India Jeanne Jonty Rhodes.

బిడ్డకు ఇండియా జెన్నీగా నామకరణం చేసిన జాంటీరోడ్స్

Posted: 04/24/2015 06:30 PM IST
Jonty rhodes blessed with baby girl born natural water birth

దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ తండ్రిగా మారాడు. ఆయన సతీమణి మిలేనీ జెన్నీ ముంబైలోని శాంతా క్రజ్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో పండంటి పాపకు జన్మనిచ్చారు. అయితే భారతదేశ:లో సర్వసాధారణంగా అస్పత్రిలో పిల్లల్ని కన్నట్టుగా కాకుండా.. మిలేనీ జెన్నీ మరో విధానం ద్వారా పాపకు జన్మనించింది. మన దేశంలో అంతగా ప్రాచుర్యం పొందని, దక్షిణాఫ్రికాలో అత్యంత ప్రాచూర్యం పోందిన 'వాటర్ బర్త్' విధానం ద్వారా పాపకు జన్మనిచ్చారు.

ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 8వ ఎడిషన్‌లో బిజీగా ఉన్న జాంటీ రోడ్స్ డెలివరీ కోసం మూడు నెలల ముందే భారత్‌కు వచ్చారు. గురువారం మధ్యాహ్నాం పాప పుట్టిందని, తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారని... బిడ్డ 3.71 కిలోల బరువుందని శాంతా క్రూజ్‌లోని సూర్య మదర్ అండ్ చైల్డ్ కేర్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ భూపేంద్ర అశ్వతీ తెలిపారు. జాంటీ రోడ్స్ దంపతులు తమ పాపాకు ఇండియా జెన్నీ జాంటీ రోడ్స్‌గా నామకరణం చేశారు. బిడ్డకు జన్మనిచ్చేందుకు వారు 'వాటర్ బర్త్' విధానాన్ని ఎంచుకున్నారని, అందుకోసం మూడు నెలలుగా శిక్షణ తీసుకున్నారని వెల్లడించారు. అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో అత్యధిక జననాలు ఈ 'వాటర్ బర్త్' విధానంలోనే జరుతున్నాయని ఆమె వివరించారు. గత నాలుగు సంవత్సరాలుగా మా ఆసుపత్రిలో 'వాటర్ బర్త్' విధానంలోనే డెలివరీలు చేస్తున్నామని, ఇప్పటి వరుక 35 మంది పిల్లలకు జన్మనిచ్చినట్లు తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  tema india  jonty rhodes  south africa  ipl  

Other Articles