Indian Cricket Captain Mahendra Singh Dhoni Moves Court Against Maxx Mobile Firm

Mahendra singh dhoni moves court against max mobile firm

Mahendra Singh Dhoni news, Mahendra Singh Dhoni updates, Mahendra Singh Dhoni Maxx Controversy, Maxx Mobiles Firm, Dhoni Maxx Mobile Firm, Dhoni Controversy News, Dhoni Gallery, Dhoni Updates, Dhoni chennai news, Dhoni Delhi High Court, Dhoni Maxx Firm

Mahendra Singh Dhoni Moves Court Against Maxx Mobile Firm : The Delhi High Court on Monday sought response from a mobile company on a contempt plea filed by Indian cricket team skipper Mahendra Singh Dhoni, who alleged that the company violated the court's earlier order restraining from selling products containing endorsement of Dhoni.

ధోనీ ఇచ్చిన షాక్ కి చిక్కుల్లో పడ్డ ‘మ్యాక్స్’ మొబైల్ సంస్థ

Posted: 04/21/2015 12:41 PM IST
Mahendra singh dhoni moves court against max mobile firm

ప్రపంచవ్యాప్తంగా చాలా కూలెస్ట్ క్రికెట్ ప్లేయర్ గా ప్రత్యేక గుర్తింపు సాధించిన మహేంద్రసింగ్ ధోనీకి ఈసారి కోపమొచ్చింది. తీవ్ర ఆగ్రహానికి గురైన ఇతని కోపానికి ఏకంగా ఓ మొబైల్ సంస్థ చిక్కుల్లో పడింది. గతంలోనే ధోనీ ఆ సంస్థను హెచ్చరించాడు. కానీ ధోనీ కూలెస్ట్ డూడ్ కదా ఎటువంటి వివాదాలు రావని ఆ సంస్థ భావించిందేమో.. ఈసారి కాస్త మితిమీరి వ్యవహరించింది. అంతే! గతంలో వార్నింగ్ ఇచ్చిన ధోనీ ఈసారి ఆ సంస్థపై డైరెక్ట్ అటాక్ చేశాడు.

వివరాల్లోకి వెళ్తే.. కొన్నాళ్లక్రితం ధోనీ ‘మ్యాక్స్’ మొబైల్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగిన విషయం అందరికీ గుర్తుండే వుంటుంది. ఆ సంస్థ మొబైల్స్ ను ప్రచారం చేసే భాగంలో ధోనీ కొన్నాళ్లపాటు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో ఆ సంస్థ ధోనీతో కొన్ని యాడ్స్ చేయించుకుంది. అయితే.. తనతో ఒప్పందం కింద రూ.10 కోట్ల మేర బకాయిలు ఇంకా చెల్లించలదేని, ఇంకా ఇతరత్ర వివాదాలు వచ్చిన నేపథ్యంలో ధోనీ ఆ సంస్థతో ఒప్పందం తెగదెంపులు చేశాడు. అయినప్పటికీ ఆ మొబైల్ తయారీ సంస్థ ఒప్పందానికి విరుద్ధంగా తన పేరును ఉత్పత్తులపై వాడుకుంటోందని ధోనీ కోర్టులో ఫిర్యాదు చేశాడు. దీంతో అప్పుడు కోర్టు ధోనీ పేరును వాణిజ్యపరంగా వినియోగించరాదని ఆ సంస్థను ఆదేశించింది. కానీ.. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశం పట్టించుకోకుండా, ధోనీ కోపాన్ని గుర్తించకుండా ఆ సంస్థ అతని పేరును మళ్లీ వాడటం మొదలుపెట్టింది.

అంతే! ఓవైపు ఒప్పందం ప్రకారం ఇంకా బకాయిలు చెల్లించకపోవడమే కాక.. ఒప్పందానికి విరుద్ధంగా తన పేరును వాడుకోడంపై ధోనీకి మరింత కోపం వచ్చింది. మరోసారి ఇతగాడు ఢిల్లీ హైకోర్టులో ఆ కంపెనీ మీద ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలోనే కోర్టు ‘మ్యాక్స్’ సంస్థ నుంచి స్పందన కోరింది. మరి.. ఈసారి ఈ సంస్థ ధోనీకి బకాయిలు చెల్లిస్తుందో లేక పైత్యం ఎక్కువై మరిన్ని చిక్కుల్లో పడుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahendra Singh Dhoni  Maxx Mobile Firm  Delhi High Court  

Other Articles