James Faulkner | Australia | Glenn Maxwell

No place to the james faulkner glenn maxwell in australian team

James Faulkner, australia, Glenn Maxwell, world cup, westindies, pakistan, yashesh series

Unfortunate too are World Cup winners James Faulkner and Glenn Maxwell, victims of their own multi-format success in the sense that crammed limited overs schedules largely preclude them from playing any meaningful stretches of first-class cricket. Both have nevertheless excelled when opportunities have come.

ఆ ఇద్దరూ బెస్ట్.. కానీ టీంలో చోటు లేదు

Posted: 03/31/2015 11:29 AM IST
No place to the james faulkner glenn maxwell in australian team

ఆస్ట్రేలియాను మరోసారి ప్రపంచ విజేతగా నిలబెట్టడంలో ప్రతి ఆస్ట్రేలియా ప్లేయర్ ఎంతో కీలకంగా వ్యవహరించారు. అయితే అందులో బ్యాటింగ్ తో రెచ్చిపోయిన మ్యాక్స్ వెల్, ఆల్ రౌండర్ జేమ్స్ ఫాల్కనర్ కు గట్టి షాక్ తగిలింది. వరల్డ్ కప్  ఫైనల్లో 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' గెలుకున్న ఆల్ రౌండర్ జేమ్స్ ఫాల్కనర్, విధ్వంసకర ఇన్నింగ్స్ లో సెంచరీ బాదిన మ్యాక్స్ వెల్ ను జట్టు నుంచి సాగనంపింది. వెస్టిండీస్, ఇంగ్లండ్ పర్యటన కోసం 17 మంది ఆటగాళ్లతో ఎంపిక చేసిన టీమ్ లో వీరికి చోటు ఇవ్వలేదు. తాజాగా ముగిసిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఫాల్కనర్ 3 వికెట్లు పడగొట్టి సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఇక మ్యాక్స్ వెల్ శ్రీలంకతో జరిగిన లీగ్ మ్యాచ్ లో 51 బంతుల్లో సెంచరీ కొట్టి ప్రపంచకప్ లో రెండో వేగవంతమైన శతకం నమోదు చేశాడు.

జూన్ 5 నుంచి ప్రారంభమయ్యే వెస్టిండీస్ పర్యటనలో ఆస్ట్రేలియా రెండు టెస్టులు ఆడుతుంది. జూలై 8 నుంచి ఇంగ్లండ్ తో యాషెస్ సిరీస్ ఆడుతుంది. రియాన్ హారిస్ ను ఒక్క యాషెస్ సిరిస్ కే ఎంపిక చేశారు. మొత్తానికి వరల్డ్ కప్ లో అదరగొట్టి ఆస్ట్రేలియా కు వరల్డ్ కప్ ను తీసుకురావడంలో మ్యాక్స్ వెల్, జేమ్స్ ఫాల్కనర్ లు ఎంతో కీలకంగా వ్యవహరించారు. అయితే ఆస్ట్రేలియా టీంలో వీరిద్దరికి చోటు దక్కకపోవడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి టాప్ ప్లేయర్ లుగా కొనసాగుతున్న వారికి టీంలో ఎందుకు చోటు కల్పించలేదో ఇంకా కారణాలు తెలియడం లేదు.

ఆస్ట్రేలియా టీం..
మైఖేల్ క్లార్క్(కెప్టెన్), స్టీవ్ స్మిత్, అహ్మద్, బ్రాడ్ హడిన్, జోష్ హాసిల్ హుడ్, మిచెల్ జాన్సన్, నటాన్ లియాన్, షాఉన్ మార్ష్, మిచెల్ మార్ష్, పీటర్ నివిల్, క్రిస్ రోగర్స్, పీటర్ సిడిల్, మిషెల్ స్టార్క్, అడమ్ వోగ్స్, డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్, హారిస్.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : James Faulkner  australia  Glenn Maxwell  world cup  westindies  pakistan  yashesh series  

Other Articles