Rohit Sharma | India versus Australia | ICC Cricket World Cup 2015

It is not possible to score a 200 every day rohit

virat kohli, India vs Australia, India versus Australia, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, Australia, Australia CWC 2015, Live Scores, Live Updates, India, India CWC 2015, Sports, World Cup Live

Indian opener Rohit Sharma says people’s expectations are very high, cricket on a different level

అసీస్ కు ధీటుగానే బదులిస్తాం.. రోజూ 200 చేయడం అసాధ్యం..

Posted: 03/25/2015 08:56 PM IST
It is not possible to score a 200 every day rohit

ఆస్ట్రేలియాను సెమీ ఫైనల్ లో ధీటుగా ఎదుర్కోవడానికి భారత టీమ్ అన్ని విభాగాల్లో దృఢంగా ఉందని రోహిత్ శర్మ అన్నారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎగతాళి చేస్తూ స్లెడ్జింగ్ చేస్తే చేయనివ్వండి...అంటూ రోహిత్ అన్నారు. సెమీ ఫైనల్ లాంటి ముఖ్యమైన గేమ్ లో ఎలా ఆడాలో తమకు తెలుసని రోహిత్ తెలిపారు.  సెమీ ఫైనల్లో కంగారులను కంగారెత్తిస్తామన్నాడు. వరల్డ్ కప్‌లో ఇప్పటిదాకా సాగిస్తున్న జైత్రయాత్రను ఇకపైనా కొనసాగిస్తామన్నాడు.
 
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ స్పిన్‌కు అనుకూలిస్తుందా? లేక సీమర్లు రాణిస్తారా? అన్న అంశంపై మాకెలాంటి చింత లేదని.. ఎలాంటి ఎలాంటి పిచ్ పైనైనా రాణించే సత్తా తమకుందన్నాడు. వరల్డ్ కప్‌లో ఇప్పటిదాకా మేం ఆడిన ఏడు మ్యాచ్‌లలో 70 వికెట్లు తీశామన్నాడు. ప్రతిసారీ ప్రత్యర్థిపై పైచేయి సాధించామని చెప్పుకోచ్చారు. రేపటి మ్యాచ్‌లో ఎలా ఆడాలో తమకు తెలుసునని, టీమిండియా సీమర్లు మెరుగ్గా రాణిస్తున్నారని కితాబిచ్చాడు. అదేసమయంలో మాకు మంచి స్పిన్నర్లు కూడా ఉన్నారన్నారు.

తన 264 పరుగుల రికార్డును గప్తిల్ బద్దలు కోట్టే అంశంపై స్పందించిన రోహిత్.. రికార్డులు వున్నవే తిరగరాసుకునేందుకని అన్నాడు. పాత రికార్డులు పోయి కొత్త రికార్డలు నమోదవుతాయన్నాడు. అయితే ప్రతీ రోజు 200 పరుగులు సాధించడం సాధ్యమయ్యే పని కాదన్నాడు. అది చాల కష్టసాధ్యమని చెప్ాపరు. అయితే ప్రతీ బ్యాట్స్ మెన్ కు తాను అత్యంత ఎక్కువ పరుగులు చేయాలన్న తప్పన వుంటుందన్నారు. తాను 264 పరుగులు చేసినప్పడు మూడు వందలు చేయాల్సింది అని అన్నావాళ్లూ వున్నారన్నారు. 300 పరుగులు సాధిస్తే.. 350 పరుగులు ఇలా క్రికెట్ ఇప్పడు మరోక స్థాయికి చేరిందన్నాడు. దీనికి తోడు క్రీడాకారుడి శరీక ఆకారం కూడా వుండాలని రోహిత్ చెప్పుకోచ్చాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  India  Australia  rohit sharma  

Other Articles