Sangakkara and mahela jayawardene leaves out from one days

sangakkara and mahela jayawardene leaves out from one days, sangakarra and jayawardene retires from ODIs, Srilanka versus South africa, Srilanka vs South africa, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, South africa, South africa CWC 2015, Live Scores, Live Updates, Srilanka, Srilanka CWC 2015, Sports, World Cup Live, sangakkara, dilshan

sangakkara and mahela jayawardene announces retirement from one day internaltional games

ఓడిఐలకు వీడ్కోలు పలికిన సంగక్కర, జయవర్థనే

Posted: 03/18/2015 05:34 PM IST
Sangakkara and mahela jayawardene leaves out from one days

శ్రీలంక బ్యాటింగ్ దిగ్గజ ఆటగాళ్లు.. కుమార సంగక్కర, మహేల జయవర్ధనేలు 50 ఓవర్ల నిర్ణీత మ్యాచ్ లకు వీడ్కోలు పలికారు. వన్డే వరల్డ్ కప్ లో భాగంగా నాకౌట్ దశలో జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో లంక ఓటమి అనంతరం ఈ ఇద్దరు ఆటగాళ్ల వన్డేలకు గుడ్ బై చెప్పారు. ఈ రోజు ఆటలో శ్రీలంక పేలవంగా ఆడి వరల్డ్ కప్ నుంచి నిష్ర్కమించింది. దీంతో ముందగా ప్రకటించినట్లుగానే లంక బ్యాట్స్ మెన్లు కుమార సంగక్కర, మహేలా జయవర్థనే లు వన్డేల నుంచి వైదొలిగారు.

ఇప్పటివరకూ సుదీర్ఘ క్రికెట్ ఆడిన సంగక్కార నేటి మ్యాచ్ అనంతరం వన్డేలకు గుడ్ బై చెబుతూ భారంగా స్టేడియంను విడిచాడు. దీంతో సంగక్కరను అళింగనం చేసుకుని సహచర క్రికెటర్లు ఆయన వీడ్కోలు పలికారు. ఇప్పటి వరకు 404 వన్డేలు ఆడిన సంగక్కార 25 సెంచరీలు, 93 హాఫ్ సెంచరీలు సాయంతో 14,234 పరుగులు సాధించిన 14 వేల పరుగుల క్లబ్ లో ప్రపంచకప్ లో భాగంగా అడిన మ్యాచ్ లలోనే చేరాడు. అతని అత్యధిక స్కోరు 169 కాగా, బ్యాటింగ్ సగటు 41.98 గా ఉంది. మహేలా జయవర్ధనే 448 వన్డేలు ఆడి 19 సెంచరీలు, 77 హాఫ్ సెంచరీల సాయంతో 12, 650 పరుగులు చేశాడు.

కాగా సంగక్కర, జయవర్థనేలు 50 ఓవర్ల నిర్ణీత మ్యాచులకు వీడ్కోలు పలకడం పట్ల వారిపై ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల నుంచి విషెస్ అందుతున్నాయి. అటు సామాజిక మీడియాలో కూడా వారికి శుభాకాంక్షలు వెల్లివిరుస్తున్నాయి.  ట్విట్టర్ లో పలు దేశాలకు చెందిన క్రికెట్ క్రీడాకారులు కూడా సంగక్కరకు అభినందనలు తెలుపుతున్నారు. ఒంటి చేత్తో మ్యాచ్ ను గెలపించగల సంగాక్కరను ఆసాంతం అకాశానికెత్తుతున్నారు. అటు భారత బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ కూడా సంగక్కర, జయవర్థనేలకు అభినందనలు తెలిపారు. వారు లేకుండా శ్రీలంక టీమ్ ను ఊహించకోడానికి కూడా మనస్సు అంగీకరించడం లేదన్నారు. ఇద్దరికి శుబాకాంక్షలను తెలిపారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : icc criket world cup 2015  sangakkara  mahela jayawardene  Srilanka  

Other Articles