Kumar sangakkara creates history with 4th successive century

Kumar Sangakkara creates history, Sangakkara creates history, Sangakkara creates history with 4th successive century, Srilanka versus Scotland, Srilanka versus Scotland, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, Scotland, Scotland CWC 2015, Live Scores, Live Updates, Srilanka, Srilanka CWC 2015, Sports, World Cup Live, sangakkara, dilshan

In the history of 3,631 ODIs before today, no batsman had scored 4 successive centuries. But on Wednesday, Sangakkara became the first ever batsman to achieve the feat. He brought up the historic ton, in 86 balls, with a couple on the last ball of the 34th over by Kyle Coetzer. This was Sangakkara's 25th ODI ton in 403rd match.

4 వరుస శతకాలతో సంగక్కర రికార్డు

Posted: 03/11/2015 01:46 PM IST
Kumar sangakkara creates history with 4th successive century

ప్రపంచ కప్ టోర్నమెంటు ప్రారంభం నుంచి సూపర్ ఫామ్లో ఉన్న శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర మరో రికార్డు నెలకొల్పాడు. వన్డే క్రికెట్లో వరుసగా నాలుగు సెంచరీలు బాదిన తొలి బ్యాట్స్మన్గా సంగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే ప్రపంచ కప్లో హ్యాట్రిక్ సెంచరీలు చేసిన సంగక్కర.. స్కాట్లాండ్ తో హోబర్ట్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో వరుసగా నాల్గవ శతకాన్ని సాధించి.. ఈ అద్భుత ఘట్టానికి చేరుకున్న  తొలి ఆటగాడి రికార్డు నెలకొల్పాడు.

తాజాగా స్కాట్లాండ్ తో మ్యాచ్ లో మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు.  56 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన సంగక్కర.. మరో 30 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. సంగా మొత్తం 86 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్లతో 124 పరుగులు చేశాడు. రిటైర్మెంట్కు చేరువవుతున్న సంగక్కర అద్భతాలు చేయడం విశేషం.

ప్రపంచ కప్ గ్రూపు-ఎలో భాగంగా స్కాట్లాండ్తో మ్యాచ్లో దిల్షాన్ తో కలసి సంగక్కర ఈ ఫీట్ సాధించాడు. కోయెట్జర్ వేసిన ఇన్నింగ్స్ 34వ ఓవర్లో సంగక్కర శతకాన్ని నమోదు చేసుకుని రికార్డులను తిరగరాసుకున్నాడు. ప్రపంచ కప్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ జాబితాలో ఆరు సెంచరీలతో సచిన్ టెండుల్కర్ ముందు వరుసలో నిలువగా, ఆ తర్వాతి స్థానంలో ఐదు సెంచరీలతో సంగక్కర, పాంటింగ్ లు వున్నారు. అయితే వరుసగా నాలుగు సెంచరీలను సాధించన వారు ప్రపంచకప్ లో ఇప్పటి వరకు లేకపోవడం గమనార్హం. ఆ స్థానాన్ని సంగక్కర భర్తీ చేసి చరిత్ర సృష్టించాడు. దీంతో ఇప్పటి వరకు 403 వన్డేలను ఆడిన సంగక్కరకిది 25వ సెంచరీ

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc criket world cup 2015  Srilanka  Scotland  sangakkara  dilshan  

Other Articles