Martin crowe to be inducted into the icc cricket hall of fame

New Zealand former captain Martin Crowe, Martin Crowe will be inducted into the ICC Cricket Hall of Fame, honour for martin crowe, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015

New Zealand former captain Martin Crowe, will be inducted into the ICC Cricket Hall of Fame during the ICC Cricket World Cup 2015.

మార్టిన్ క్రో కు దక్కిన అరుదైన గౌరవం

Posted: 02/26/2015 07:34 PM IST
Martin crowe to be inducted into the icc cricket hall of fame

న్యూజీలాండ్ మాజీ కెప్టెన్ బ్యాటింగ్ దిగ్గజం మార్టిన్ క్రోకు అరుదైన గౌరవం లభించనుంది.  త్వరలో ఈ గోప్ప స్టైలిష్ బ్యాట్ మెన్ ను ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్  లో సభ్యత్వం స్వీకరించనున్నారు. వన్డే వరల్డ్ కప్ లో ఈ నెల 28న రెండు అతిథ్య జట్లు న్యూజీలాండ్, అస్ట్రేలియాల మధ్య జరగనున్న మ్యాచ్ అనంతరం ఆయనకు ఈ గౌరవాన్ని ప్రధానం చేయనున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఇవాళ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ తాజా ఎంపికతో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లోని సభ్యులు సంఖ్య 79 కు చేరనుంది. అంతకుముందు ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ లో న్యూజీలాండ్ నుంచి సర్ రిచర్డ్ హ్యాడ్లీ, డెబ్బీ హోక్లీ తరువాత మార్టిన్ క్రోకు స్థానం లభించనుంది.

1982లో పందోమ్మిదవ యేట అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన మార్టిన్ క్రో తొలి మ్యాచ్ ను ఫిబ్రవరిలో అస్ట్రేలియాతో ఆడాడు. ఆ తరువాత 13 ఏళ్లకు 1995లో ఆయన క్రికెట్ నుంచి విరామం తీసుకున్నారు. తన సుదీర్ఘ క్రికెట్ ప్రయాణంలో 77 టెస్టు మ్యాచ్ లు అడిన మార్టిన్ సగటున 45.36తో 5 వేల 444 పరుగులు సాధించాడు. ఇందులో భాగంగా ఆయన 17 సెంచరీలు సాధించాడు. శ్రీలంకతో 1991లో జరిగిన మ్యాచ్ లో 299 పరుగులు సాధించి రికార్డు నెలకొల్పాడు. దీంతో పాటు 143 వన్డే మ్యాచ్ లు ఆడిన క్రో 38.55 పరుగలు సగుటున 4 వేల 704 పరుగులు సాధించాడు. ఈ ప్రయాణంలో ఆయన మూడు పర్యాయాలు ప్రపంచ క్రికెట్ కప్ లో భాగం పంచుకున్నాడు. ఈ రికార్డులను పరిగణలోకి తీసుకున్న ఐసీసీ.. అనిల్ కు హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు కల్పించనుంది

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Martin crowe  icc hall of fame  newzealand  

Other Articles