Shikhar dhawan worldcup 2015 performances highlights

shikhar dhawan news, shikhar dhawan performance, shikhar dhawan world cup, shikhar dhawan latest news, shikhar dhawan cricket history, shikhar dhawan innings, shikhar dhawan india cricket, shikhar dhawan family, shikhar dhawan controversies

shikhar dhawan worldcup 2015 performances highlights : Shikhar dhawan got first place as highest scorer in world cup 2015 according to the present situation.

ఫామ్ లోకొచ్చాడు.. టాప్ స్కోరర్ గా నిలిచాడు!

Posted: 02/24/2015 12:27 PM IST
Shikhar dhawan worldcup 2015 performances highlights

ప్రపంచకప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా దిగిన భారత్.. అంతకుముందు ఎన్నో విమర్శల బారిన పడింది. ఆమధ్య ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ చెత్తగా ఓడిపోవడం, తర్వాత ముక్కోణపు సిరీస్ లో దారుణంగా పరాజయం కావడంతో ప్రపంచవ్యాప్తంగా వున్న క్రికెట్ దిగ్గజాలు భారత్ పై విమర్శలు గుప్పించారు. ఇక అభిమానులైతే తిట్టపురాణం సంధించారు. ఇండియా ప్రదర్శించిన ఆ పేలవ పెర్ఫార్మెన్స్ ను చూసిన అనంతరం వరల్డ్ కప్ గెలవడం అసాధ్యమేనంటూ కొందరు తేల్చి పారేశారు కూడా! క్రీడాపండితులు కూడా ఈ విధంగానే పేర్కొంటూ.. క్వార్టర్స్ వరకు వెళ్తుందని జోష్యం చెప్పారు. కానీ.. ప్రపంచకప్ లోకొచ్చేసరికి ఆ ఊహాగానాలన్నీ గల్లంతయ్యాయి. నిన్నటివరకు చెత్త బ్యాటింగ్ ప్రదర్శించిన ఇండియా ఆటగాళ్లు.. ఇప్పుడు వరల్డ్ కప్ మైదానంలో దుమ్ముదులుపుతున్నారు.

అటువంటి ఆటగాళ్లలో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే శిఖర్ ధావన్ ఫెర్ఫార్మెన్స్ ఎంతో అద్భుతం. గతకొన్నాళ్ల నుంచి పేలవ పర్ఫార్మెన్స్ ప్రదర్శిస్తూ భారత అభిమానుల ఆగ్రహానికి గురైన క్రికెటర్ శిఖర్ ధావన్.. ప్రపంచకప్ లో మాత్రం మాంచి ఫామ్ లోకొచ్చి శివమెత్తిన విషయం తెలిసిందే! మొదట పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో.. ఆ ఆట మొదట్లో కాస్త తడబడ్డాడు. కానీ తనదైన ప్రదర్శనతో ముందుకు దూసుకుపోతూ 73 పరుగులు చేసి, జట్టు విజయానికి దోహపడ్డాడు. అలాగే.. సఫారీలతో జరిగిన మ్యాచ్ లో ఇతగాడు 137 పరుగులు చేసి, భారీ స్కోరువైపుకు ఇండియా జట్టును తీసుకెళ్లాడు. ఇతను చేసిన ఆ సెంచరీతోనే భారత్ సులువుగా మ్యాచ్ గెలిచింది. ఈ విధంగా వరల్డ్ కప్ లో మొదటి రెండు మ్యాచుల్లోనూ ధావన్ ప్రదర్శించిన ఆటను చూసి, క్రికెట్ అభిమానులతోపాటు క్రికెట్ దిగ్గజాలు సైతం అతడ్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ఇదిలావుండగా.. ఒక్కసారిగా అనుకోకుండా ఫామ్ లోకొచ్చిన శిఖర్.. వరల్డ్ కప్ టాప్ బ్యాట్స్ మేన్ గా నిలిచాడు. ఇప్పటివరకు జరిగిన గణాంకాల ప్రకారం 210 చేసిన ధావనే నెంబర్ వన్ బ్యాట్స్ మేన్! మొత్తం 14 జట్లలో వున్న ఆటగాళ్లలో ఏ ఒక్కరూ ఇంత స్కోరును నమోదు చేయకపోవడంతో ధావన్ మొదటి స్థానంలో నిలిచాడు. ఇదే ఫాంను ధావన్ కొనసాగిస్తే.. ఖచ్చితంగా మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలుస్తాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. వరల్డ్ కప్ ముందు 10 మ్యాచ్ లు ఆడిన ధావన్ కేవలం 216 పరుగులు మాత్రమే చేశాడు. కానీ... వరల్డ్ కప్ లో మాత్ర కేవలం 2 మ్యాచుల్లోనే 210 పరుగులు చేయడంపై ఇతడు మ్యాచ్ ఆఫ్ టోర్నీగా టైటిల్ గెలుచుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి.. అతను ఆ టైటిల్ గెలుచుకుంటాడా..? లేదా..? అన్నది వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : shikhar dhawan worldcup innings  shikhar dhawan controversies  

Other Articles