Rift between ms dhoni virat kohli is trash talk ravi shastri

rift between ms dhoni virat kohli, rift between dhoni virat kohli trash, Kohli Dhoni rift trash says Ravi Shastri, India's Team Director Ravi Shastri, Indian test cricket out going captain dhoni, indian test cricket incoming captain kohli, Indian Team Director Ravi Shastri interview, Ravi shastri latest updates, ravi shastri latest news, virat kohli latest updates, virat kohli latest news, dhoni latest news, dhoni latest updates

All is well between India's incoming and outgoing Test captains, and talk of a rift between Virat Kohli and Mahendra Singh Dhoni is nothing but just trash, said India's Team Director Ravi Shastri in an interview.

ధోనీ, కోహ్లీ మధ్య విభేదాలా... నాన్సెన్స్: రవిశాస్త్రి

Posted: 01/03/2015 09:53 PM IST
Rift between ms dhoni virat kohli is trash talk ravi shastri

విరాట్ కోహ్లీతో విభేదాలే ధోని రిటైర్మెంట్‌కు కారణమంటూ వస్తున్న కథనాలపై టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి స్పందించాడు. ధోని, కోహ్లీ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అవన్నీ చెత్త కథనాలంటూ ఓ ప్రముఖ న్యూస్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో స్పష్టం చేశాడు. ఆ వార్త కథనాలన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశాడు. "కోహ్లీయే కాదు, సహాయక సిబ్బంది, అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది సహా జట్టులోని ప్రతి ఒక్కరు ధోనీ ఆజ్ఞలను గౌరవిస్తారని పేర్కొన్నారు.

కొత్త సంవత్సరం సందర్భంగా టీమిండియాకు ఆస్టేలియా ప్రధాని టోనీ అబాట్ ఇచ్చిన టీ పార్టీ తర్వాత జరిగిన ఇంటర్వ్యూలో రవిశాస్త్రీ పలు విషయాలను పంచుకున్నారు. బ్రిస్‌బేన్ టెస్టు మ్యాచ్ జరుగుతున్నప్పుడు కోహ్లీ, థావన్ ల మధ్య కూడా మీడియా గొడవ పెట్టేసి కథనాన్ని కూడా రాసుకుందని చెప్పారు. డ్రెస్సింగ్ రూమ్‌పై వచ్చిన వార్తలనింటినీ ఆయన కోట్టిపారేశారు. గత ఐదు సంవత్సరాలుగా కోహ్లీ టీమిండియా సభ్యుడిగా కొనసాగుతున్నాడు. మరికొంత మంది అండర్ - 19 నుంచి టీమిండియాకు క్రికెట్ ఆడుతున్నారని తెలిపాడు.

టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవాలని ధోనీ తీసుకున్న నిర్ణయం జట్టునంతటినీ ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పాడు. అయితే, తాను అతని నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టు శాస్త్రి పేర్కొన్నాడు. రిటైర్మెంట్ అనేది వ్యక్తిగత వ్యవహారమని, అత్యుత్తమ క్రీడాకారులకు తాము ఎప్పుడు నిష్క్రమించాలో తెలుసని అన్నాడు. ఆ నిర్ణయాన్ని ఎవరు ప్రశ్నిస్తారని అన్నారు. అతనేమీ 100 టెస్టుల రికార్డు, ఇతర గణాంక ఘనతల కోసం వేచి చూడలేదని, ఘనమైన వీడ్కోలు కోరుకోలేదని చెప్పాడు. ఇది అతని వ్యక్తిత్వానికి నిదర్శనం అని చెప్పాడు.

 

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  dhoni  virat kohli  ravi shastri  

Other Articles