Former cricketer imran khan former tv anchor reham khan marriage issue

imran khan news, imran khan reham khan news, tv anchor reham khan, tv anchor reham khan hot photos, reham khan imran khan, imran khan latest news, political leader imran khan

former cricketer imran khan former tv anchor reham khan marriage issue : the rumours are going on that former cricketer and political leader imran khan secretly married with former weather tv anchor reham khan

మాజీ యాంకర్’తో ఇమ్రాన్ సరసాలు!

Posted: 12/31/2014 05:47 PM IST
Former cricketer imran khan former tv anchor reham khan marriage issue

పాకిస్తాన్ తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ పార్టీ అధినేత అయిన మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్’కు సంబంధించి ఓ వార్త ప్రచారం జరుగుతోంది. అతడు ఓ మాజీ యాంకర్’తో రహస్యంగా సరసాసల్లాపాలు జరుపుతున్నాడని.. ఇటీవలే వివాహం కూడా చేసుకున్నాడని జోరుగా వార్తలు సందడి చేస్తున్నాయి. 62 ఏళ్ల ఇమ్రాన్, 41 ఏళ్ల రెహామ్ అనే మాజీ టీవీ యాంకర్’తో పెళ్లి చేసుకున్నాడని పాక్ మీడియాలో ఒకటే వార్తలు! ఇంకొక విషయం ఏమిటంటే.. ఆమెకు ముగ్గురు పిల్లలు వున్నారని, భర్త నుంచి విడాకులు తీసుకుని విడిగా వుంటోందట! ఈ నేపథ్యంలో ఆమెకు ఇమ్రాన్’తో అనుకోకుండా ఏర్పడిన పరిచయం ప్రేమగా, ఇప్పుడు వివాహం దాకా వచ్చిందని అంటున్నారు.

పాకిస్తాన్’కు చెందిన రెహామ్.. బీబీసీలో వాతావరణ వార్తల యాంకర్’గా పనిచేసిన సమయంలో బ్రిటన్’లో కొంతకాలం నివసించింది. అప్పుడే ఆమెకు ఇమ్రాన్’తో అనుకోకుండా పరిచయం ఏర్పడిందని తెలుస్తోంది. ఇక ఇమ్రాన్ ఎలాగూ తన భార్య జెమిమా గోల్డ్’స్మిత్’కు పదేళ్ల కిందటే విడాకులు ఇచ్చాడు కాబట్టి.. అనంతరకాలంలో యాంకర్ రెహామ్’తో ఏర్పడిన పరిచయం ప్రేమవైపుగా దారితీసింది. కొంతకాలం వరకు వీళ్లిద్దరూ గుట్టుచప్పుడు కాకుండా సరసాసల్లాపాలు కొనసాగించారని.. తాజాగా ఒక్కటయ్యారని వార్తలు పాకిస్తాన్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అయితే ఈ విధంగా వార్తలు కుప్పలుతెప్పలుగా వస్తున్నప్పటికీ.. ఇమ్రాన్ ఖాన్ నుంచి మాత్రం ఈ విషయంపై ఇంతవరకు ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ఇక మాజీ యాంకర్ రెహామ్ నుంచి ఎటువంటి స్పందనా లేదు. ఇదిలావుండగా.. ప్రముఖ యాంకర్ జావెద్ రబ్బానీ ఈనెల 27వ తేదీన ‘‘ఓ యాంకర్, ఓ రాజకీయ నాయకుడిని ఈరోజు పెళ్లి చేసుకుంది’’ అని ట్వీట్ చేశాడు. అప్పటినుంచి ఈ ప్రచారం కొనసాగింది కానీ.. ఈమధ్య అయితే ఇది వైరస్’లా పాకిపోయింది. అందరూ నిజమేనని దాదాపుగా ఫిక్స్ కూడా అయ్యారు. మరోవైపు ఇమ్రాన్ కుటుంబసభ్యులు ఈ వివాహం తమకు ఇష్టంలేదని పేర్కొనడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles