Virat kohli says has no reason to respect annoying mitchell johnson

indian cricketer virat kohli, virat kohli disrespected annoying mitchell johnson, ustralian sledging, Australian cricket sledging, australian bowler mitchell johnson, virat kohli says no respect to johnson, spoilt brat kohli disrespect annoying johnson, india vs australia 2014 third test day 3, india vs australia 2014, india vs australia 2014 series

Star Indian batsman Virat Kohli has slammed Australia's sledging, claiming that he had no reason to respect their pace spearhead Mitchell Johnson and insisting that the hosts' players called him a spoilt brat.

స్టంప్స్ పైన గురి పెట్టు..నా బాడీపై కాదు..

Posted: 12/29/2014 12:44 PM IST
Virat kohli says has no reason to respect annoying mitchell johnson

టీమిండియా డాషింగ్ బ్యాట్స్ మెన్ గా పేరుగాంచిన విరాట్ కోహ్లీ.. అంతే దూకుడు స్వభావం వున్నవాడన్న కామెంట్లు ఇప్పటికే టీమిండియాలో వున్నాయి. ఇటీవల భారత్ బ్యాట్స్ మెన్ శిఖార్ ధావన్ పై ఆయన మండిపడ్డారన్న కథనాల నేపథ్యంలో ఇవి మరింతగా బలపడ్డాయి. అకారణంగా ఎవరినీ నొప్పించని స్వభావమున్న కోహ్లీ తనపై ఇతరులు అకారణంగా తనను ఇబ్బంది పెట్టే పరిస్థితులో మాత్రం విరుచుకుపడతారు. ఇందుకు నిదర్శనమే అసీస్ తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్ మూడవ రోజున జరిగిన ఘటన.

భారత్ ఇన్నింగ్స్‌లో 83వ ఓవర్... జాన్సన్ బౌలింగ్‌లో కోహ్లి ముందుకొచ్చి నేరుగా షాట్ ఆడాడు. దానిని అందుకున్న జాన్సన్, కోహ్లిని రనౌట్ చేసేందుకు స్ట్రయికింగ్ ఎండ్ వైపు విసిరాడు. అయితే అది నేరుగా కోహ్లి వీపును తాకింది. వెంటనే ఆసీస్ బౌలర్ ‘సారీ’ చెప్పేశాడు. దీనిపై తీవ్రంగా రియాక్ట్ అయిన కోహ్లీ స్టంఫ్స్ వైపు బంతిని విసిరేందుకు ప్రయత్నించు నా బాడీ (శరీరం)పై కాదంటూ మిచ్చల్ జాన్సన్ కు బదులిచ్చాడు. అయితే బంతి అనుకోకుండా తగిలిందని, కావాలని విసరేదన్న జాన్సన్ సమాధానం ఇవ్వబొతుండగా, తన ఉద్దేశ్యం కూడా చెప్పాలి కదా అంటూ విరాట్ కోహ్లీ అడుకున్నాడు. దీంతో ఇరువురి మద్య రోజంతా హాట్ హాట్ గానే కామెంట్ నడిచాయి.

మైదానంలో అర్థంపర్థం లేని మాటలు తాను మాట్లాడనని... క్రికెట్ ఆడటం కోసం క్రీజులో ఉన్నానని, తనకు తగిన మర్యాద ఇవ్వని ఆటగాడికి నేను కూడా ఎలాంటి మర్యాద ఇవ్వాల్సిన అవసరం గానీ కారణం గానీ లేదంటూ జాన్సన్ గురించి వ్యాఖ్యానించాడు. ఒకసారైతే అంపైర్లు కూడా కలగజేసుకోవాల్సి వచ్చింది. తన బౌలింగ్‌లో కోహ్లి విరుచుకుపడ్డ తీరు కూడా జాన్సన్‌కు ఆగ్రహం తెప్పించి ఉంటుంది. అయితే తన ఆట ద్వారానే భారత స్టార్ బదులిచ్చాడు. జాన్సన్ బౌలింగ్‌లో 73 బంతులు ఎదుర్కొన్న విరాట్ 68 పరుగులు చేశాడు. అతను కొట్టిన 18 ఫోర్లలో 11 జాన్సన్ బౌలింగ్‌లోనే వచ్చాయి.

ఆసీస్ ఆటగాళ్లు తనను చెడిపోయిన పిల్లాడని విమర్శించారని చెప్పాడు. అసీస్ ఆటగాళ్లు ద్వేషించడమే తనకు కిష్టమని చెప్పారు. తనను వారన్న ప్రతీమాట తనకే లాభించిందిని, ఇప్పటి వరకు తన టెస్ట్ కెరీర్ లో తాను అత్యధిక పరుగులు (169) చేసిన మ్యాచ్ ఇదేనన్నాడు. అయినా అసీస్ ఆటగాళ్లు మారరని కోహ్లీ వ్యాఖ్యానించాడు.’ అని కోహ్లి చెప్పాడు. సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో ఉండటం వల్లే ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, 1-1తో సమంగా ఉన్నప్పుడు ఇలా మాట్లాడగలిగేవారా అని ప్రశ్నించిన కోహ్లి, భారత్‌లో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు రావెందుకో అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  mitchell johnson  respect  india vs australia 2014  

Other Articles