Virender sehwag latest press meet bounce balls 2016 worldcup philip hughes death

virender sehwag latest news, virender sehwag press meet, virender sehwag interview, virender sehwag comments, virender sehwag photos, virender sehwag matches, virender sehwag 2016 worldcup, virender sehwag philip hughes, virender sehwag bounce balls, virender sehwag australia tour, australia cricket grounds

virender sehwag latest press meet bounce balls 2016 worldcup philip hughes death

బౌన్సర్ల మీద వీరూ వీరవిహారం.. నిషేధిస్తే మజాపోతుందట!

Posted: 12/03/2014 11:35 AM IST
Virender sehwag latest press meet bounce balls 2016 worldcup philip hughes death

ఇటీవలే ఆస్ట్రేలియా యువక్రికెటర్ ఫిలిప్ హ్యూస్ దేశీయ క్రికెట్ సందర్భంగా బౌన్సర్ బంతికి బలైన విషయం తెలిసిందే! ఇలా ఈవిధంగా బౌన్సర్లు తగిలి చాలామంది గాయాలపాలవడంతోబాటు నలుగురి ప్రాణాలు పోయిన నేపథ్యంలో అలాంటి (బౌన్సర్) బంతులను నిషేధించాలన్న వాదనలు వినిపించాయి. అలాగే పిచ్’పరంగా కొన్ని జాగ్రత్తలు పాటించి, బౌన్సర్ల వ్యవహారంలో ఆటగాళ్లకు కొన్ని సూచనలు ఇవ్వాలంటూ కొంతమంది అభిప్రాయపడ్డారు. దీంతో ఈ విషయమై ఐసీసీ ఆందోళనల్లో మునిగిపోయింది. అయితే ఈ వాదలన్నింటికీ వ్యతిరేకంగా.. ‘‘బౌన్సర్లు నిషేధిస్తే మజా పోతుంది’’ అంటూ డాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

‘‘పుల్ షాట్ ఆడబోయి బంతి తలకు తగిలి హ్యూస్ చనిపోవడం నిజంగా ఎంతో విచారకరమైంది. అయితే ఇదంతా క్రికెట్ జీవితంలో ఓ భాగం. ఏ క్రీడలో అయినా గాయాలపాలవడంతో పాటు కొన్ని సందర్భాల్లో చనిపోవచ్చు కూడా. అలా అని ప్రమాదకర బౌన్సర్లను తొలగిస్తే అది పూర్తిగా బ్యాట్స్‌మెన్ గేమ్ అయిపోతుంది. కాబట్టి బౌన్సర్లపై నిషేధం విధిస్తే గేమ్’లో వున్న అసలు మజా పోతుంది. నా కెరీర్‌లో కూడా చాలా  బౌన్సర్లు హెల్మెట్‌కు తాకాయి’’ అని వీరూ పేర్కొంటున్నాడు. ఐసీసీ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని సూచించాడు. అనంతరం హ్యూస్ మరణానికి సంతాపం తెలిపాడు.

మరోవైపు.. దాదాపు రెండేళ్లపాటు జట్టుకు దూరమైన సెహ్వాగ్, ప్రపంచకప్’కు ప్రకటించే 30మంది ప్రాబబుల్స్’లో తనకు ఖచ్చితంగా చోటుదక్కుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ‘‘30 మందితో కూడిన ప్రాబబుల్స్ జాబితాలో నా పేరు ఉంటుందనే ఆశిస్తున్నాను. ప్రతీ క్రికెటర్‌లాగే నాకు కూడా మళ్లీ ప్రపంచకప్‌లో ఆడాలనే ఉంది. ఈసారి భారత్ కప్‌ను నిలబెట్టుకునే అవకాశాలున్నాయి. ప్రస్తుత ఆసీస్ పర్యటనలో ఫలితం ఎలా ఉంటుందో తెలియకపోయినా మన ఆటగాళ్లు మాత్రం బాగానే రాణిస్తారని అనుకుంటున్నాను’’ అని ప్రపంచకప్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సెహ్వాగ్ పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles